యూత్ స్టార్ బ్యాక్ టూ బ్యాక్ ప్లానింగ్!
యూత్ స్టార్ నితిన్ ఆలస్యమైనా బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ లతో రాబోతున్నాడా? పది రోజుల వ్యవధిలోనే రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది.
By: Tupaki Desk | 1 March 2025 10:30 AM GMTయూత్ స్టార్ నితిన్ ఆలస్యమైనా బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ లతో రాబోతున్నాడా? పది రోజుల వ్యవధిలోనే రెండు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. నితిన్ హీరోగా `రాబిన్ హుడ్`, `తమ్ముడు` చిత్రాలు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు సెట్స్ కి వెళ్లిచాలా కాలమవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ సినిమాలు ఆన్స్ సెట్స్ లో కనిపిస్తున్నాయి. వెంకీ కుడుముల దర్శ కత్వంలో తెరకెక్కుతోన్న` రాబిన్ హుడ్` ఇప్పటికే రిలీజ్ కావాలి.

కొన్ని సార్లు రిలీజ్ తేదీలు కూడా ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో వాయిదా వేసారు. చివరిగా మార్చి 28న వస్తున్నారు. `హరి హరవీరమల్లు` అదే తేదీన ప్రకటించడంతో `రాబిన్ హుడ్` వాయిదా వేసే అవకాశముందని ఓ వైపు ప్రచారం జరుగుతోంది. అయితే నితిన్ మాత్రం వాయిదా వేసే ప్రసక్తి లేదని..ఆ రోజు ఎంత మంది హీరోలు రిలీజ్ కు ఉన్నా? తాను మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటూ బరిలోకి దిగుతున్నాడు.
ఆ నమ్మకంతోనే తన అభిమాన స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వీరమల్లు ఉన్నా వెనక్కి తగ్గడం లేదంటున్నారు. ఇక `రాబిన్ హుడ్` రిలీజ్ అయిన పది రోజుల్లోనే మే 9న `తమ్ముడు` చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. ఈ రిలీజ్ తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడ నుందంటున్నారు. దీంతో నితిన్ సినిమాలు రిలీజ్ ఆలస్యమైనా బ్యాక్ టూ బ్యాక్ అభిమానుల్ని అలరించే లా ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది.
నితిన్ చివరి సినిమా `ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్` 2023 లో రిలీజ్ అయింది. ఆ తర్వాత మరో సినిమా రిలీజ్ కాలేదు. గత ఏడాది నుంచి `తమ్ముడు`, `రాబిన్ హుడ్` రిలీజ్ అవుతాయని ప్రచారం తప్ప రిలీజ్ కు నోచుకోలేదు. ఇప్పుడు అన్ని లెక్కలు సరిచేసేలా రెండు చిత్రాలు ఓకేసారి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు. నితిన్ కి ఈసినిమాల సక్సెస్ కూడా అంతే కీలకం.` భీష్మ` తర్వాత చేసిన ఐదు సినిమాలు ఆశించిన ఫలితాలు అందించని సంగతి తెలిసిందే.