Begin typing your search above and press return to search.

ఇక నితిన్ 'తమ్ముడు'.. ఏం చేస్తాడో?

దీంతో నితిన్ తదుపరి ప్రాజెక్ట్‌పై ఫోకస్ మళ్లింది. ఇప్పుడు ఆయన చేస్తున్న ‘తమ్ముడు’ సినిమా అంచనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.

By:  Tupaki Desk   |   31 March 2025 6:49 AM
ఇక నితిన్ తమ్ముడు.. ఏం చేస్తాడో?
X

స్టార్ హీరో నితిన్ వరుసగా చేసిన ప్రయోగాలు ఫలించకపోవడంతో బాక్సాఫీస్ వద్ద కాస్త వెనకబడినట్టు కనిపిస్తున్నారు. నితిన్ కెరీర్ లో ఫ్లాప్స్ కొత్తేమి కాదు. ఒక దశలో కెరీర్ ముగిసింది అనుకున్న టైమ్ లో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. ఆడియెన్స్ రెగ్యులర్ సినిమాలను పెద్దగా ఇష్టపడడం లేదనే సంకేతం నితిన్ ఇంకా ఎక్కించుకోలేదా అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.

లేటెస్ట్ గా విడుదలైన ‘రాబిన్ హుడ్’ చిత్రం మంచి ప్రమోషన్, స్టార్లు గెస్ట్‌లా రావడం, యూత్ కంటెంట్ అన్నీ ఉన్నప్పటికీ థియేటర్లలో అసలైన ఎఫెక్ట్ చూపించలేకపోయింది. డైరెక్టర్ వెంకీ కుడుముల నుంచి మళ్ళీ హిట్ వస్తుందనుకున్న ప్రేక్షకుల్లోనూ అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో నితిన్ తదుపరి ప్రాజెక్ట్‌పై ఫోకస్ మళ్లింది. ఇప్పుడు ఆయన చేస్తున్న ‘తమ్ముడు’ సినిమా అంచనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.

ఈ చిత్రాన్ని స్టార్ నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులని విభిన్నంగా ఆకట్టుకునేలా వస్తుందన్న బజ్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. గతంలో ‘వకీల్ సాబ్’తో మంచి టాక్ తెచ్చుకున్న వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తమ్ముడు చిత్రంలో నితిన్, సీనియర్ నటి లయ అక్క పాత్రల్లో కనిపించనున్నారు.

ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్‌తో నడిచే కథ అని తెలుస్తోంది. ఇందులో కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఓ కీలక యాక్షన్ ఎపిసోడ్ కోసం రెండు కోట్ల రూపాయల బడ్జెట్ వేశారన్న వార్తలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడంతా ఈ సినిమా విడుదలపై దృష్టి పెట్టింది. ఇన్‌సైడ్ టాక్ ప్రకారం, దర్శకుడు వేణు శ్రీరామ్ మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసి చివరి దశ పనులలో బిజీగా ఉన్నట్టు సమాచారం.

ముందుగా వేసవి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా, తాజాగా మే 9వ తేదీ కోసం మేకర్స్ చూస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. అదే రోజున విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు వాయిదా పడే అవకాశం ఉండటంతో తమ్ముడుని ఆ డేట్‌కి మార్చే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. మరొకవైపు, బాక్సాఫీస్ వద్ద నితిన్ తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఇదే బాగా వర్క్ అవుతుందన్న నమ్మకం ఉంది.

గతంలో వచ్చిన ఫ్లాపుల వలన మార్కెట్‌లో డామేజ్ తలెత్తినప్పటికీ, తమ్ముడు కంటెంట్ బలంగా ఉంటే తిరిగి గేమ్‌లోకి రావచ్చు. ట్రైలర్‌కి రెస్పాన్స్ బాగుంటే, అంచనాలు మళ్లీ పెరిగే ఛాన్సుంది. దిల్ రాజు కూడా ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నట్టు సమాచారం. మొత్తానికి నితిన్ కోసం ‘తమ్ముడు’ ఓ కీలక మలుపు కావొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ మే 9న ఈ సినిమా వచ్చి హిట్ అయితే, అది మిగతా ప్రాజెక్టులపై కూడా ప్రభావం చూపించవచ్చు. దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా హిట్ కోసం ఎదురుచూస్తుండటంతో, ఈ సినిమా నుంచి మంచి ఫలితం రాకపోతే అతనికి కూడా కష్టమే. మరి తమ్ముడు సెంటిమెంట్ ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.