Begin typing your search above and press return to search.

78 కోట్ల నుంచి 10కోట్లకు పడిపోయిన నితిన్.. రాబిన్ హుడ్ టార్గెట్ ఎంత?

ఇప్పుడీ పతనానికి బ్రేక్ వేయాలని నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో ప్రయత్నిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   18 March 2025 1:23 PM IST
78 కోట్ల నుంచి 10కోట్లకు పడిపోయిన నితిన్.. రాబిన్ హుడ్ టార్గెట్ ఎంత?
X

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గత కొంతకాలంగా వరుసగా ఫ్లాప్స్ ఎదుర్కొంటూ తన మార్కెట్‌పై ప్రభావం పడేలా చేశాడు. ఒకప్పుడు వరుస హిట్స్‌తో మంచి కమర్షియల్ హీరోగా పేరు తెచ్చుకున్న నితిన్, ఇటీవల వచ్చిన సినిమాలతో ఆ ఊపును నిలబెట్టుకోలేకపోయాడు. 2020లో వచ్చిన భీష్మ సినిమాతో 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన అతను, ఆ తర్వాత వచ్చినసినిమాలతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ముఖ్యంగా నితిన్ సినిమాలకు ఓపెనింగ్స్ బాగానే వస్తున్నా, కనీసం యావరేజ్ టాక్ వచ్చినా ఓవర్ఆల్‌గా నష్టాలు తప్పడం లేదు.

ఇప్పుడీ పతనానికి బ్రేక్ వేయాలని నితిన్ రాబిన్ హుడ్ సినిమాతో ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఆయనకు చాలా కీలకం, ఎందుకంటే ఇది నితిన్-వెంకీ కుడుముల హిట్ కాంబోలో వస్తోంది. భీష్మ లాంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ అదే కాంబోలో రాబోయే ఈ సినిమా, నితిన్ కెరీర్‌ను గాడిలో పెట్టే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా కనీసం 30 కోట్ల షేర్ టార్గెట్‌గా బరిలోకి దిగుతోంది. కానీ దీనికి ప్రాముఖ్యత ఏమిటంటే, నితిన్ గత సినిమాల రిజల్ట్ చూస్తే, 30 కోట్ల మార్క్ అందుకోవడం అంత తేలికైన పని కాదు. చెక్, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ 10 నుంచి 15 కోట్ల మధ్యలో నష్టాలు కలిగించాయి. ముఖ్యంగా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ కేవలం 10 కోట్లు మాత్రమే రాబట్టింది.

నితిన్ కెరీర్‌లో టాప్ 5 బాక్సాఫీస్ కలెక్షన్స్ చూసుకుంటే:

1. అ ఆ - ₹78 కోట్లు గ్రాస్, ₹47.4 కోట్లు షేర్ (బ్లాక్‌బస్టర్)

2. భీష్మ - ₹50 కోట్లు గ్రాస్, ₹28.6 కోట్లు షేర్ (సూపర్ హిట్)

3. ఇష్క్ - ₹40 కోట్లు గ్రాస్, ₹22.6 కోట్లు షేర్ (సూపర్ హిట్)

4. రంగ్ దే - ₹40 కోట్లు గ్రాస్, ₹22.6 కోట్లు షేర్ (సూపర్ హిట్)

5. గుండెజారి గల్లంతయ్యిందే - ₹20 కోట్లు గ్రాస్, ₹10.5 కోట్లు షేర్ (హిట్)

నితిన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అఆ.. ఆ తరువాత మళ్ళీ అలాంటి హిట్ చూసింది లేదు. కానీ పాజిటివ్ టాక్ వస్తే అతను 50 కోట్లు తెగలడని నిరూపించాడు. కాబట్టి ఎక్స్ ట్రా ఇచ్చిన డిజాస్టర్ నుంచి బయటకు రావాలి అంటే సాలీడ్ హిట్ కొట్టాలి.

నితిన్ గత రెండు సంవత్సరాల్లో చేసిన సినిమాలు మిగిలిన హిట్ సినిమాల కంటే అర్థం ఉండని కథలతో, కంటెంట్ పరంగా బలహీనంగా ఉన్నాయనే వాదన ఉంది. ఇప్పటి ట్రెండ్‌లో కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. యావరేజ్ టాక్ వచ్చినా ప్రేక్షకులు ఆదరించడంలేదు. నితిన్ గతంలో హిట్ రేంజ్ బాగా ఉన్నప్పటికీ, ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. కనీసం 30 కోట్ల షేర్ రాబట్టాలంటే మౌత్ టాక్ చాలా కీలకం.

ఇప్పటి వరకూ విడుదలైన రాబిన్ హుడ్ టీజర్, పాటలు మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయితే మేకర్స్ మాత్రం సినిమా ఫన్నీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని, థియేటర్లలో కామెడీ వర్కౌట్ అయితే హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు. కానీ మాడ్ స్క్వేర్ వంటి హిట్ సినిమా ఈ సినిమాతో పోటీ పడటం కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ఒకవేళ నితిన్-వెంకీ కుడుముల మళ్లీ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తే, రాబిన్ హుడ్తో నితిన్ తన సక్సెస్ ట్రాక్‌ను రీసెట్ చేసుకునే అవకాశముంది. ఆడియన్స్ ఎలా స్పందిస్తారనేది మార్చి 28న స్పష్టమవుతుంది.