తనకు ఆస్కార్ రావాలంటున్న శ్రీలీల
నితిన్ హీరోగా వస్తోన్న తాజా సినిమా రాబిన్‌హుడ్. గత కొంత కాలంగా ఏ సినిమా చేసినా నితిన్ కు ఫ్లాపే ఎదురౌతుంది.
By: Tupaki Desk | 26 Feb 2025 3:16 PM GMTనితిన్ హీరోగా వస్తోన్న తాజా సినిమా రాబిన్‌హుడ్. గత కొంత కాలంగా ఏ సినిమా చేసినా నితిన్ కు ఫ్లాపే ఎదురౌతుంది. అందుకే ఈ సారి తనకు భీష్మ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ కుడుములతో చేతులు కలిపి అతని దర్శకత్వంలో రాబిన్‌హుడ్ అనే సినిమా చేశాడు. కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అంటే రాబిన్‌హుడ్ రిలీజ్ కు సరిగ్గా 30 రోజులు మాత్రమే ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్ తోనే రాబిన్‌హుడ్ సినిమా థియేటర్లలో నవ్వులు పూయించడం, ఆడియన్స్ ను థ్రిల్లయ్యేలా చేయడం కన్ఫర్మ్ అని తేలిపోయింది. రిలీజ్ మరో నెల రోజులే ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టేసింది.
అందులో భాగంగానే కౌంట్ డౌన్ ను స్టార్ట్ చేస్తూ రాబిన్‌హుడ్ మేకింగ్ వీడియోను, కొన్ని గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. మేకింగ్ వీడియో చూస్తుంటేనే రాబిన్‌హుడ్ సినిమా ఎంత సరదాగా, ఫన్ తో తెరకెక్కిందో అర్థమవుతుంది. సినిమాకు పని చేస్తున్నంతసేపు ప్రతి ఒక్కరూ సెట్స్ లో చాలా ఆనందంగా, జాలీగా గడిపినట్టు మేకింగ్ వీడియో ద్వారా తెలుస్తోంది.
అయితే ఈ మేకింగ్ వీడియోలో నవ్వుతూనే శ్రీలీల నాకు ఆస్కార్ రావాలి అని అనేసింది. మరోసారి మైక్ పట్టుకుని పాడుతుండగా, నితిన్ తనపై జోకులేస్తూ ఆటపట్టించాడు. ఆఖరిగా సినిమాకు మరో 30 రోజులే ఉంది వెయిట్ చేయమని సెటైరికల్ గా చూపించారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మరి నితిన్ నమ్మకాన్ని రాబిన్‌హుడ్ ఏ మేర నిలబెడుతుందో చూడాలి.