Begin typing your search above and press return to search.

నితిన్ 'రాబిన్ హుడ్' సెన్సార్ టాక్.. ఇది మ్యాటర్!

యూత్‌ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ‘రాబిన్ హుడ్’ మూవీ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది.

By:  Tupaki Desk   |   25 March 2025 1:22 PM IST
నితిన్ రాబిన్ హుడ్ సెన్సార్ టాక్.. ఇది మ్యాటర్!
X

యూత్‌ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ‘రాబిన్ హుడ్’ మూవీ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. ‘భీష్మ’ సినిమా తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్, టీజర్, సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమా మీద హై బజ్ క్రియేట్ అయింది.


ప్రమోషన్స్ పరంగా ఈసారి మూవీ టీమ్‌ కొత్త స్ట్రాటజీ ఎంచుకుంది. అంతర్జాతీయ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను సినిమాలో గెస్ట్ రోల్‌లో చూపిస్తూ, ఓ ప్రత్యేక లుక్, చిన్న క్లిప్ ద్వారా సినిమాకు ఫుల్ అటెన్షన్ తెచ్చారు. ట్రైలర్ రిలీజ్ సమయంలోనూ వార్నర్ హాజరై సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇదే అంశాన్ని క్యాష్ చేసుకునేలా ప్రమోషన్ ప్లాన్ చేశారు. క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయి.

ఇదిలా ఉండగా, తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. అంతేకాదు, ఈ సినిమా రన్ టైమ్ రెండు గంటల 36 నిమిషాలు ఉండగా, కమర్షియల్ ఎంటర్టైనర్‌కు ఇది బాగా సరిపోతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సెన్సార్ టాక్ ప్రకారం ఫస్ట్ హాఫ్ లో హై వోల్టేజ్ సీన్స్ తో, కామెడీ ప్రధానంగా ఉండగా, రెండో భాగంలో టర్నింగ్ పాయింట్స్, ట్విస్ట్‌లు ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తాయని తెలుస్తోంది.

నితిన్, వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్‌ల మధ్య వచ్చే కామెడీ ఎపిసోడ్‌లు ఆడియన్స్‌ని థియేటర్‌లో ఓ పక్క నవ్విస్తూ మరో పక్క మాస్ ఫీల్ ఇస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉండనుందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. నితిన్ క్యారెక్టర్‌లో వేరియేషన్స్, గెటప్స్, ఎమోషన్స్, యాక్షన్, కామెడీ అన్నీ సమపాళ్లలో ఉండటంతో ఓ పక్క కమర్షియల్ సటిస్ఫాక్షన్, మరోపక్క ఫ్రెష్‌నెస్ ఉంటుందని అంటున్నారు.

ఇక డేవిడ్ వార్నర్ ఎంట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతను వచ్చే సన్నివేశం కాస్త అనూహ్యంగా ఉండి, ప్రేక్షకుల్లో అలర్ట్ క్రియేట్ చేసేలా ఉంటుందని టాక్. అలాగే శ్రీలీల ఈ సినిమాలో చేసిన పాత్ర, డాన్స్‌లు, కామెడీ టైమింగ్ మరోసారి ఆమె టాలెంట్‌ను హైలైట్ చేస్తాయని సమాచారం. జివి ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి మరింత బలంగా నిలుస్తుందట. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో ట్రెండ్ అవుతున్నాయి. మొత్తంగా సెన్సార్ టాక్, ఇండస్ట్రీలో ఉన్న బజ్ ప్రకారం చూస్తే ‘రాబిన్ హుడ్’ సినిమా నితిన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచే అవకాశాలున్నాయన్న చర్చ బలంగా సాగుతోంది. మార్చి 28న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఓపెనింగ్స్ మొదలుకొని, వసూళ్ల వరకూ ఓ రికార్డు బ్రేకింగ్ రన్‌కి సిద్ధంగా ఉందని స్పష్టమవుతోంది.