Begin typing your search above and press return to search.

'రాబిన్ హుడ్' తమ్ముడు.. రెండు నెలల గ్యాప్ లోనే..

యంగ్ హీరో నితిన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ఈ రెండు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   17 Dec 2024 6:43 AM GMT
రాబిన్ హుడ్ తమ్ముడు.. రెండు నెలల గ్యాప్ లోనే..
X

యంగ్ హీరో నితిన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ఈ రెండు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. వెంకి కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్ మూవీ’ చేస్తున్నాడు. ఈ మూవీ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతోంది. డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ అవుతుందని డేట్ ఎనౌన్స్ చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ వాయిదా వేశారు. ఈ చిత్రంలో శ్రీలీల నితిన్ కి జోడీగా నటిస్తోంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటాననే నమ్మకంతో నితిన్ ఉన్నారు. ‘భీష్మ’ తర్వాత నితిన్, వెంకి కుడుముల కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతోంది. దీంతో పాటు దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ‘తమ్ముడు’ అనే సినిమా కూడా నితిన్ చేస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ నితిన్ అక్కగా నటిస్తోంది. ఓ విధంగా ఈ సినిమాతో ఆమె సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తుందని చెప్పొచ్చు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేయడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారంట. నిజానికి ‘రాబిన్ హుడ్’ లేదంటే ‘తమ్ముడు’ సినిమాలలో ఏదో ఒకటి జనవరిలో రిలీజ్ అవుతుందని అనుకున్నారు.

రాబిన్ హుడ్ సంక్రాంతికి దాదాపు ఫిక్స్ అయినట్లు టాక్ వచ్చింది. అయితే సంక్రాంతి రేసులో ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు ఉన్నాయి. ఈ మూడింటిపైన ఎక్స్ పెక్టేషన్స్ గట్టిగానే ఉన్నాయి. వీటితో పోటీపడటం కష్టం అని నితిన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సంక్రాంతి రేసులో రిలీజ్ అవుతున్న మూడు సినిమాలలో రెండు దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వస్తున్నాయి. ఇక ‘తమ్ముడు’ సినిమాను కూడా కాస్త గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేయాలని దిల్ రాజు ఫిక్స్ అయ్యారు.

రాబిన్ హుడ్ 2025 శివరాత్రిలో వచ్చే అవకాశం ఉంది. ఇక తమ్ముడు రెండు నెలల గ్యాప్ తరువాత మే ఆఖరికి రావచ్చని టాక్. ‘భీష్మ’ తర్వాత నితిన్ కి ఇప్పటి వరకు ఒక్క సక్సెస్ లేదు. అయితే నెక్స్ట్ రాబోయే రెండు సినిమాలు కెరియర్ పరంగా తనకి ప్లస్ అవుతాయని నితిన్ అనుకుంటున్నాడు. ముఖ్యంగా ‘రాబిన్ హుడ్’ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. రాబోయే రెండు సినిమాలు హిట్ అయితే నితిన్ కి మరల మార్కెట్ పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు.