ఎల్లమ్మలో హీరోయిన్ స్ట్రాంగ్ ఎమోషన్..!
జబర్దస్త్ వేణుని ఇప్పుడు కమెడియన్ మాత్రమే అంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే బలగం లాంటి సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వేణు.
By: Tupaki Desk | 3 March 2025 4:00 AM ISTజబర్దస్త్ వేణుని ఇప్పుడు కమెడియన్ మాత్రమే అంటే మాత్రం ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే బలగం లాంటి సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వేణు. నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన వేణు డైరెక్టర్ గా మారి చేసిన తొలి సినిమాతోనే అదరగొట్టాడు. బలగం సినిమాలో ప్రియదర్శి ఒక్కడే కాస్త తెలిసిన ఫేస్ కాగా మిగతా వారంతా కొత్త వారినే తీసుకుని వారితో మంచి అవుట్ పుట్ వచ్చేలా చేసుకున్నాడు వేణు.
ఐతే బలగం తర్వాత వేణు ఎల్లమ్మ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇది ఆధ్యాత్మికతకు సంబందించిన కథ అని తెలుస్తుంది. గ్రామ దేవతల నేపథ్యంతో ఎల్లమ్మ కథ ఉంటుందని టాక్. దిల్ రాజు బ్యానర్ లో నితిన్ హీరోగా ఈ సినిమా రాబోతుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి కాగా సినిమా కాస్టింగ్ ని డిక్లేర్ చేసే పనుల్లో యూనిట్ బిజీగా ఉన్నారు.
ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని టాక్. ముఖ్యంగా ఎల్లమ్మ లో హీరోయిన్ ఎమోషన్ చాలా ఇంపాక్ట్ కలగచేస్తుందని తెలుస్తుంది. అందుకే ఆ పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకోవాలనే ప్లానింగ్ లో ఉన్నారు. ఐతే సాయి పల్లవి కథ నచ్చితే చేయడానికి రెడీ అవుతుంది. నితిన్ ఎల్లమ్మలో సాయి పల్లవి ఓకే అయితే మాత్రం సినిమాకు అది మొదటి సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు.
ఎల్లమ్మ లో సాయి పల్లవి నటిస్తుందా ఆమెను ఎగ్జైట్ అయ్యేలా వేణు కథ చెప్పగలడా లేదా అన్నది చూడాలి. నితిన్ రాబోతున్న సినిమాల లైనప్ అంతా ఒక రేంజ్ లో ఉంది. ఈ నెల చివర్లో రాబిన్ హుడ్ గా రాబోతున్న నితిన్ నెక్స్ట్ తమ్ముడు అంటూ మే 9న వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఎల్లమ్మ కూడా నితిన్ కెరీర్ లో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కానుందని చెప్పొచ్చు. మరి ఇంతకీ ఎల్లమ్మ కాస్టింగ్ ఏంటి ఈ సినిమాకు ఎవరెవరు పనిచేస్తారు. బడ్జెట్ వివరాలు ఏంటి లాంటి వాటికి ఆన్సర్ దొరకాలనటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే.
నితిన్ ఎల్లమ్మ కథ ఏంటన్నది కూడా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది. రాబోయే 3 సినిమాలతో నితిన్ తన కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. అదే జరిగితే మాత్రం నితిన్ కూడా సరైన ట్రాక్ లోకి వచ్చినట్టే అని చెప్పుకోవచ్చు.