Begin typing your search above and press return to search.

అలా ఇద్ద‌రు దోచుకెళ్లిపోతే వాళ్ల ప‌రిస్థితి ఏంటి?

తాజాగా ఓ స‌మావేశంలో నితిన్...శ్రీలీల కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు.

By:  Tupaki Desk   |   16 March 2025 1:05 PM IST
అలా ఇద్ద‌రు దోచుకెళ్లిపోతే వాళ్ల ప‌రిస్థితి ఏంటి?
X

యూత్ స్టార్ నితిన్- శ్రీలీల జంట‌గా 'రాబిన్ హుడ్' లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు తొలిసారి జ‌త క‌డుతున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలతో ఆన్ స్క్రీన్ పై అద్భుత‌మైన ఫెయిర్ గా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఆ జోడీ అంద‌మైంది? అంటూ ఎన్నో కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా ఓ స‌మావేశంలో నితిన్...శ్రీలీల కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు.

కొంద‌రు హీరోల ఫోటోల‌ను నితిన్ కి చూపించి వీళ్ల నుంచి మీరు ఏం దొంగిలించాల‌నుకుంటున్నారు? అంటే! నితిన్ ఇలా అన్నాడు. 'నాని నుంచి 'ఈగ' సినిమా దొగిలించాలి. ఆయన స్క్రిప్ట్ సెల‌క్ష‌న్ చాలా బావుంటుంది. ఆక్వాలిటీని దొగిలించాలి. ఎన్టీఆర్ నుంచి డైలాగ్ డెలివిరీ, మ‌హేష్ నుంచి అందం, స్వాగ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి అన్ని విష‌యాలు దొగిలించాల్సిందే.

ప్ర‌భాస్ నుంచి ఆయ‌న వ్య‌క్తిత్వం, రాజ‌సం, విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి రౌడీ క్యారెక్ట‌ర్ తీసుకోవాల‌ని ఉంది అన్నాడు. శ్రీలీల కూడా ఇదే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చింది. 'కాజ‌ల్ నుంచి క‌ళ్లు.. అనుష్క నుంచి ఎత్తు, వ్య‌క్తిత్వం దొగిలించాల‌నుకుంటున్నా అంది. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. వాళ్ల స‌మాధానాల‌కు నెటి జ‌నులు కామెంట్లు మంచి ఫ‌న్నీగా ఉన్నాయి.

అలా వాళ్ల నుంచి అన్నీ దోచుకెళ్లిపోతే వాళ్ల ప‌రిస్థితి ఏంటి? మీ నుంచి కూడా ఇత‌రులు వాళ్ల‌కు కావాల్సి న‌వ‌న్నీ దోచుకుపోతే మీ ప‌రిస్థితి? అంటూ స‌ర‌దా కామెంట్లు పెడుతున్నారు. రాబిన్ హుడ్ మార్చి లోనే రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విజ‌యం పై నితిన్ చాలా కాన్పిడెంట్ గా ఉన్నాడు.