Begin typing your search above and press return to search.

నితిన్.. మళ్ళీ అదే నమ్మకంతో..

డిఫరెంట్ కాన్సెప్ట్ లతో చేసిన ప్రయోగాలు కూడా దెబ్బతీశాయి.

By:  Tupaki Desk   |   7 Oct 2024 6:12 AM
నితిన్.. మళ్ళీ అదే నమ్మకంతో..
X

టాలెంటడ్ యాక్టర్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరోలలో నితిన్ కచ్చితంగా ఉంటాడు. అయితే మిగిలిన హీరోలతో పోల్చుకుంటే నితిన్ కి సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. స్టోరీ సెలక్షన్ విషయంలో చిన్న చిన్న పొరపాట్లు కారణంగా నితిన్ కి ఆశించిన స్థాయిలో విజయాలు రావడం లేదనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తూ ఉంటుంది. అలాగే ఒక్కోసారి మాస్ యాక్షన్ కథలు ట్రై చేసి చేతులు కాల్చుకున్నాడు.

డిఫరెంట్ కాన్సెప్ట్ లతో చేసిన ప్రయోగాలు కూడా దెబ్బతీశాయి. నితిన్ కి చివరిగా భీష్మతో సక్సెస్ వచ్చింది. తరువాత చేసిన సినిమాలేవీ కూడా హిట్ కాలేదు. చివరిగా మాచర్ల నియోజకవర్గం అనే యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ అందుకున్నాడు. ఇకపై మాత్రం తనకి సెట్ అయ్యే కథలని ఎంచుకొని మూవీస్ చేయాలని నితిన్ డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ప్రస్తుతం ఆడియన్స్ ఇంటరెస్ట్ కి తగ్గట్లుగా కూడా కంటెంట్ స్టైల్ మార్చుకోవాలని అనుకుంటున్నాడు.

అందులో భాగంగానే ‘భీష్మ’ తో సక్సెస్ ఇచ్చిన వెంకి కుడుములతో నితిన్ ‘రాబిన్ హుడ్’ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతోందని తెలుస్తోంది. అలాగే వేణుశ్రీరామ్ దర్శకత్వంలో ‘తమ్ముడు’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. తాజాగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మూవీకి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

నితిన్ కెరియర్ లో వరుస ఫ్లాప్ లతో ఉన్నప్పుడు విక్రమ్ కె కుమార్ అతనికి ‘ఇష్క్’ తో సూపర్ హిట్ ఇచ్చాడు. ఆ సినిమా సక్సెస్ తర్వాత నితిన్ మరల కెరియర్ పరంగా గాడిలో పడ్డాడు. విక్రమ్ కె కుమార్ టాలెంట్ మీద నితిన్ కి మంచి నమ్మకం ఉంది. విక్రమ్ కె కుమార్ సినిమాల పరంగా ప్రస్తుతం ఫ్లాప్ లలో ఉన్నాడు. అయితే ‘దూత’ అనే వెబ్ సిరీస్ తో మరల సక్సెస్ అందుకున్నాడు.

విక్రమ్ కె కుమార్ టాలెంట్ మీద నమ్మకంతో నితిన్ అతను చెప్పిన కథకి ఒకే చెప్పారంట. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధం అయ్యారంట. ప్రస్తుతం ఈ మూవీ ఫైనల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది. ఇదంతా అయ్యాక మూవీ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.