విక్రమ్‌తో టాలీవుడ్ గర్వించే సినిమా
ఈ ప్రమోషన్స్ లో భాగంగా నితిన్ ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ కె. కుమార్ తో తాను సినిమా చేయనున్నట్టు వెల్లడించాడు.
By: Tupaki Desk | 21 March 2025 11:13 AM ISTటాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తాను నటించిన రాబిన్‌హుడ్ ప్రమోషన్స్ కోసం నితిన్ తెగ కష్టపడుతున్నాడు. నితిన్ తన కెరీర్ లో ఈ సినిమాకు చేసినంతగా ప్రమోషన్స్ మరే సినిమాకు చేసింది లేదు. అడిగిన వారందరికీ ఇంటర్వ్యూలిస్తూ నితిన్ రాబిన్‌హుడ్ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా నితిన్ ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ కె. కుమార్ తో తాను సినిమా చేయనున్నట్టు వెల్లడించాడు. గతంలో వీరిద్దరి కలయికలో ఇష్క్ సినిమా వచ్చింది. నితిన్ కెరీర్లోని అతి పెద్ద హిట్ మూవీస్ లో ఇష్క్ కూడా ఒకటి. విక్రమ్ కు కూడా ఇష్క్ మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. ఇష్క్ చూశాకే నాగార్జున విక్రమ్ ను పిలిచి మరీ మనం ఆఫర్ ఇచ్చాడు.
అయితే ఇష్క్ మూవీ తర్వాత నితిన్- విక్రమ్ కలయికలో మరో సినిమా వచ్చింది లేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ వీరి కాంబోలో సినిమా రాబోతున్నట్టు నితిన్ తెలిపాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న ఈ సినిమా అన్నీ అనుకున్నట్టు జరిగి ఆడియన్స్ కు కనెక్ట్ అయితే టాలీవుడ్ గర్వపడే సినిమా అవుతుందని నితిన్ వెల్లడించాడు.
విక్రమ్ ఆల్రెడీ ఈ సినిమా స్క్రిప్ట్ పైనే వర్క్ చేస్తున్నాడని, ఆల్రెడీ నితిన్- విక్రమ్ కు మధ్య ఓ సారి డిస్కషన్స్ కూడా అయ్యాయని తెలుస్తోంది. అయితే విక్రమ్ గత కొన్ని సినిమాలుగా సరైన ట్రాక్ లో లేడు. కానీ ఆయన నుంచి ఆఖరిగా వచ్చిన దూత వెబ్ సిరీస్ మాత్రం అతనికి మంచి పేరును తెచ్చిపెట్టింది. దూత తర్వాత విక్రమ్ నుంచి రాబోయే సినిమా ఇష్క్ హీరోతోనే అని ఇప్పుడు నితిన్ మాటల్ని బట్టి క్లారిటీ వచ్చేసింది.
ఇక నితిన్ విషయానికొస్తే ఆల్రెడీ రాబిన్‌హుడ్ ను రిలీజ్ చేస్తున్న ఈ యంగ్ హీరో, వేణు శ్రీ రామ్ తో తమ్ముడు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది కాకుండా బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో నితిన్ ఎల్లమ్మ మూవీని ఒప్పుకున్నాడు. ఇప్పుడు విక్రమ్ సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. నితిన్ లైనప్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.