Begin typing your search above and press return to search.

ప్రమోషన్స్‌ పేరుతో హీరోను టార్చర్‌ పెడుతున్న దర్శకుడు!!

నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'రాబిన్‌హుడ్‌' సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Tupaki Desk   |   7 March 2025 12:35 PM IST
ప్రమోషన్స్‌ పేరుతో హీరోను టార్చర్‌ పెడుతున్న దర్శకుడు!!
X

నితిన్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'రాబిన్‌హుడ్‌' సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన భీష్మ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఐదేళ్ల తర్వాత మళ్లీ వీరి కాంబోలో మూవీ రాబోతుంది. భీష్మ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందన్న రాబిన్‌హుడ్‌లో నటించాల్సి ఉన్నా ఆమె బిజీగా ఉన్న కారణంగా తప్పుకుంది. రాబిన్‌హుడ్‌ సినిమాను అధికారికంగా ప్రకటించిన సమయంలో నితిన్‌ హీరోగా, రష్మిక హీరోయిన్‌గా వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా అన్నారు. కానీ రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో శ్రీలీల వచ్చి చేరిన విషయం తెల్సిందే.

ఇప్పటికే నితిన్‌, శ్రీలీల జోడీగా కనిపించిన పాటలు విడుదల అయ్యాయి. అంతే కాకుండా కేతిక శర్మ ఈ సినిమాలో ఐటెం సాంగ్‌ చేయబోతుంది అనే వార్తలు వచ్చాయి. మొత్తానికి సినిమాకు పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ చేయడంలో ఇప్పటి వరకు మేకర్స్ సఫలం అయ్యారు. సినిమాను గత ఏడాది డిసెంబర్‌లో క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయాలి అనుకున్న సమయంలోనే ఫన్నీ ప్రమోషనల్‌ వీడియోలను షేర్‌ చేశారు. ఇప్పుడు మరోసారి ప్రమోషనల్‌ వీడియోలతో సందడి చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫన్నీ స్కిట్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కామన్‌ అయింది. అందుకే రాబిన్‌హుడ్‌ టీం మెంబర్స్ విభిన్నంగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

రాబిన్‌హుడ్‌ సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమంలో భాగంగా నితిన్ రెగ్యులర్‌గా ఏదో ఒక వీడియోను షేర్ చేస్తున్నారు. ఆ మధ్య మేకింగ్‌ వీడియోను విడుదల చేసిన నితిన్‌, ఆ తర్వాత కమెడియన్‌ వెన్నెల కిషోర్‌తో ఉన్న వీడియోను సైతం షేర్‌ చేశాడు. తాజాగా దర్శకుడు వెంకీ కుడుములతో చేసిన ఫన్నీ వీడియోను నితిన్‌ షేర్‌ చేశాడు. ఆ వీడియోలో వెంకీ కుడుముల ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేద్దాం అంటూ నితిన్‌ వెంట పడుతున్నాడు. నిద్ర లేచించి మొదలుకుని బెడ్‌ మీద, బాత్‌ రూంలో, వ్యాయామం చేసే సమయంలో ఇలా ప్రతి చోట అన్న రాబిన్‌హుడ్‌ ప్రమోషన్స్ ఎప్పుడు చేద్దాం అంటూ అడుగుతూ టార్చర్‌ పెట్టినట్లు సరదా వీడియో షేర్‌ చేశాడు.

దర్శకుడు వెంకీ కుడుముల టార్చర్ భరించలేక ఇక సరే ప్రమోషన్ మొదలు పెడతాం అంటాడు. దీంతో సినిమా ప్రమోషన్స్ మరింత స్పీడ్‌గా చేయబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. నితిన్‌ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఈ సినిమాతో మరోసారి భీష్మ తరహాలో డీసెంట్‌ హిట్‌ను అందుకుంటాను అనే నమ్మకంతో నితిన్ ఉన్నాడు. మరి నితిన్‌కి ఆ విజయం దక్కేనా చూడాలి అంటే మార్చి 28 వరకు వెయిట్‌ చేయాల్సిందే. ఈ సినిమాతో శ్రీలీల తన సక్సెస్ జర్నీని కొనసాగించేనా అనేది కూడా చూడాలి.