Begin typing your search above and press return to search.

ఆయ్.. హీరో కాన్ఫిడెన్స్ బాగుందండోయ్..!

నార్నే నితిన్ సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించగా బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు.

By:  Tupaki Desk   |   10 Aug 2024 12:19 PM GMT
ఆయ్.. హీరో కాన్ఫిడెన్స్ బాగుందండోయ్..!
X

సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ గీతా ఆర్ట్స్ 2 నుంచి బన్నీ వాసు ఏదైనా సినిమా చేస్తున్నారు అంటే అది కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తంది. మ్యాడ్ తో మెప్పించిన హీరో నార్నే నితిన్ లీడ్ రోల్ లో అంజి కె మణిపుత్ర డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఆయ్. నార్నే నితిన్ సరసన నయన్ సారిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించగా బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఆగష్టు 15న్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి మరిన్ని విషయాలను పంచుకునేందుకు నార్నే నితిన్ మీడియాతో ముచ్చటించి ఆయ్ సినిమాకు సంబందించి మరిన్ని విషయాలు చెప్పారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం.


ఆయ్ సినిమా గురించి చెబుతూ ముందు టైటిల్ ఆయ్ అనుకోలేదని. అరవింద్ గారి సజెషన్ తోనే అది పెట్టామని అన్నారు నార్నే నితిన్. గోదావరి స్లాంగ్ లో ఆయ్ అనేది కామన్ గా ఆడుతారు. ఆ పదం సినిమాలో కూడా బాగా వాడేశాం అదే సినిమా టైటిల్ అయ్యింది. ఈ సినిమా మొత్తం ఫన్ ఫుల్ గా ఉంటుంది. అందుకే పోస్టర్స్ లో కూడా ఫన్ బాత్ అని పెట్టామని నార్నే నితిన్ అన్నారు. ఈ ఐడియా మాత్రం డైరెక్టర్ అంజి గారిదని అయితే సినిమా రిలీజ్ రోజు అది అందరికీ అర్ధమవుతుందని అన్నారు.


ఆగష్టు 15న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నా మా ఆడియన్స్ మాకు ఉన్నారని.. ఫన్ ఉన్న గోదావరి బ్యాక్ డ్రాప్ మూవీ వచ్చి చాలా రోజులు అవుతుంది. అందుకే ఈ సినిమా కచ్చితంగా ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేస్తారని అన్నారు నార్నే నితిన్.

చిన్ననాతి నుంచి నాకున్న గోదావరి ఫ్రెండ్స్ తో మాట్లాడటం, వాళ్ల మటలు వినడం వల్ల ఆయ్ లో స్లాంగ్ అంత ఇబ్బందిగా అనిపించలేదు. డైరెక్టర్ అంజి అమలాపురం వ్యక్తి. ఆయన ఫ్రస్ట్రేషన్, లైఫ్ లో చూసిన అన్నీ కలిపి ఆయ్ లో చూపించాడు. సెట్స్ లో డైరెక్టర్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారని అన్నారు నార్నే నితిన్. మ్యాడ్ కథకు తగినట్టుగా అక్కడ బిహేవ్ చేస్తే.. ఆయ్ కథకు తగినట్టుగా ఇక్కడ యాక్ట్ చేశానని అన్నారు. సినిమా కోసం స్పెషల్ గా ఏమి కష్టపడలేదని డైరెక్టర్ చెప్పింది చేశానని అన్నారు నితిన్.

ఎన్టీఆర్‌ గారు ట్రైల‌ర్ చూసి ఇంప్రెస్ అయ్యారు. ఆయ‌న‌కు సినిమాలో కామెడీ బాగా న‌చ్చింది. బాగా ఎంజాయ్ చేశారు. సినిమా చూశాక కూడా కూడా ఎన్టీఆర్‌ గారి నుంచి అలాంటి రెస్పాన్స్ వ‌స్తే బాగుంటుందని అనిపిస్తుందని అన్నారు నితిన్. అంకిత్, క‌సిరెడ్డి గారితో ఆయ్ జ‌ర్నీ బాగుంది. చాలా బాగా డిస్క‌ష‌న్ చేసుకుని ఎలా చేస్తే బావుంటుంద‌నే స‌ల‌హాల‌ను తీసుకుని చేశామన్నారు నితిన్.

ఇక తను డెబ్యూ డైరెక్టర్స్‌తోనే సినిమాలు తీయాల‌ని ఏం అనుకోవ‌టం లేదని. నచ్చిన క‌థ దొరికితే సినిమాలు చేస్తున్నాను. మ్యాడ్ తర్వాత ఇప్పుడు ఆయ్ మూవీ క‌థ న‌చ్చే న‌టించాను. రామ్ మిర్యాల గారు, అజ‌య్ అర‌సాడ‌గారు మంచి మ్యూజిక్ అందించారు. హీరోయిన్ న‌య‌న్ సారిక మ‌రాఠీ అమ్మాయి. కానీ తెలుగు అమ్మాయిలానే ఉంటుంది. ఆమె పాత్ర అంద‌రికీ బాగా క‌నెక్ట్ అవుతుంది.

కులం, మ‌తం కంటే స్నేహం చాలా గొప్ప‌ది. అంత కంటే గొప్ప విష‌య‌మేదీ ఉండ‌ద‌నే మెసేజ్‌ను ఆయ్ సినిమాలో ఇస్తున్నామని అన్నారు నార్నే నితిన్. ప్రస్తుతం మ్యాడ్ సీక్వెల్ షూటింగ్ జ‌రుగుతుంది. ఈ ఏడాదే రిలీజ్ అవ్వొచ్చు. ఇంకా కొత్త ప్రాజెక్టులేవీ ఓకే చేయ‌లేదని అన్నారు నార్నే నితిన్.