Begin typing your search above and press return to search.

నితిన్.. కాంతార కొరియోగ్రాఫర్ తో పెద్ద ప్లానే!

ప్రస్తుతం నితిన్‌ ఆశలన్నీ తన అప్ కమింగ్ మూవీస్ తమ్ముడు, రాబిన్ హుడ్ పైనే పెట్టుకున్నారు.

By:  Tupaki Desk   |   30 May 2024 11:30 PM GMT
నితిన్.. కాంతార కొరియోగ్రాఫర్ తో పెద్ద ప్లానే!
X

టాలీవుడ్ నటుడు నితిన్ ఎప్పటి నుంచో సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఆయన చేసిన సినిమాలేవి హిట్ టాక్ ను అందుకోలేకపోతున్నాయి. దీంతో స్మాల్ గ్యాప్ తీసుకున్న నితిన్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టారు. రెండు చిత్రాలను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం నితిన్‌ ఆశలన్నీ తన అప్ కమింగ్ మూవీస్ తమ్ముడు, రాబిన్ హుడ్ పైనే పెట్టుకున్నారు.

ఎంసీఏ, వకీల్ సాబ్ సినిమాలతో తెలుగులో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీరామ్ వేణు.. తమ్ముడు మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడిగా అన్ని కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో కాంతార ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నటి లయ కీలక పాత్రలో యాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గ్యాప్ లేకుండా శరవేగంగా జరుగుతోంది.

ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ మూవీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. రూ.కోటికి పైగా వ్యయంతో నిర్మించిన భారీ సెట్ లో పది రోజుల పాటు యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు తమ్ముడు మేకర్స్. ఈ షెడ్యూల్ లో నితిన్ తో పాటు పలువురు యాక్టర్లపై మేజర్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు.

అయితే కేజీఎఫ్ చాఫ్టర్‌ 1, కాంతారకు వర్క్ చేసిన స్టంట్ కొరియోగ్రాఫర్‌ విక్రమ్‌ మోర్‌ తమ్ముడు సినిమాకు పనిచేస్తుండటం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ గా మారింది. ఇప్పటికే సుమారు 50 మంది ఫైటర్లతో సాగే భారీ సీక్వెన్స్ కోసం తమ్ముడు మేకర్స్ రూ.8 కోట్లు ఖర్చు చేశారని ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఇప్పుడు విక్రమ్‌ మోర్‌ కూడా మూవీ టీమ్ లో జాయిన్ అవ్వడంతో సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోనున్నాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మాలీవుడ్‌ నటి స్వస్తిక మరో కీలక పాత్రలో నటిస్తోంది. కాంతార ఫేమ్ అజనీష్‌ లోక్‌నాథ్‌ అద్భుతమైన మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ అందిస్తున్నారు. మరోవైపు నితిన్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్‌ హుడ్‌ సినిమా కూడా చేస్తున్నారు. మరి రెండు కొత్త చిత్రాలతో నితిన్ గట్టి కమ్ బ్యాక్ ఇస్తారో లేదో వేచి చూడాలి.