Begin typing your search above and press return to search.

నితిన్ 'తమ్ముడు'.. పవన్ ఫ్యాన్స్ కు పవర్ఫుల్ ట్రీట్!

టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   26 July 2024 10:14 AM GMT
నితిన్ తమ్ముడు.. పవన్ ఫ్యాన్స్ కు పవర్ఫుల్ ట్రీట్!
X

టాలీవుడ్ లో యంగ్ హీరో నితిన్ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్ అనే సంగతి అందరికి తెలిసిందే. నితిన్ చాలా సినిమాలలో పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తూ పెర్ఫార్మ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే సాంగ్స్ లో పవన్ కళ్యాణ్ సినిమాలలో వేసిన కాస్ట్యూమ్స్ తాను యూజ్ చేశాడు. అలా నితిన్ ఛాన్స్ దొరికిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ మీద తనకున్న అభిమానాన్ని చూపిస్తూ వచ్చారు.


మూవీ టైటిల్స్ విషయంలో కూడా నితిన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నాడని అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాలలో ఒక్కటైన రీమేక్ చేయాలనే కోరిక నితిన్ కి ఉంది. అది సాధ్యం కాకపోయిన పవన్ కళ్యాణ్ హిట్ మూవీ టైటిల్ తో కొత్త సినిమాని నితిన్ చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం దిల్ రాజు నిర్మాణంలో తమ్ముడు టైటిల్ తో నితిన్ సినిమా తెరకెక్కుతోంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సాంగ్ ని నితిన్ రీమిక్స్ చేయాలని అనుకుంటున్నారంట. దీనిపై త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక వేళ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సాంగ్ ని నితిన్ రీమిక్స్ చేస్తే కచ్చితంగా అది సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. నితిన్ చాలా సార్లు పవర్ స్టార్ సాంగ్స్ రీమేక్ చేయాలని అనుకున్న సాధ్యం కాలేదు.

తమ్ముడు సినిమాలో సిచువేషన్ కుదరడంతో చేయాలని ప్రయత్నంలో ఉన్నారు. దిల్ రాజు కూడా దీనికి ఒకే చెప్పినట్లు టాక్. ఇదిలా ఉంటే తమ్ముడు సినిమాలో ఒకప్పటి హీరోయిన్ లయ రీఎంట్రీ ఇస్తోంది. నితిన్ అక్క పాత్రలో ఈ చిత్రంలో ఆమె కనిపించబోతోంది. లయ పాత్ర మూవీలో చాలా స్ట్రాంగ్ గా ఉంటుందంట. వచ్చే ఏడాది ఆరంభంలో తమ్ముడు సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ నుంచి వస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. నితిన్ తమ్ముడు చిత్రంతో పాటుగా వెంకి కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ కూడా షూటింగ్ దశలో ఉంది. డిసెంబర్ 20న రాబిన్ హుడ్ సినిమాని రిలీజ్ చేయనున్నారు.