మహారాజ హీరో విషయంలో ట్విస్ట్ తెలుసా..?
ఈ సినిమా కథ ముందు వేరే హీరో కోసం రాసుకోగా అది కాస్త విజయ్ దగ్గరకు వచ్చింది.
By: Tupaki Desk | 22 Aug 2024 2:45 AM GMTకోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి రీసెంట్ గా తన 50వ సినిమాగా మహారాజ అనే సినిమా చేశాడు. నిథిలన్ స్వామినాథన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడమే కాదు ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా రికార్డులు సాధించింది. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో వచ్చిన మహారాజ సినిమా కథ రాసుకున్నప్పుడు డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ విజయ్ సేతుపతిని హీరోగా అనుకోలేదట. ఈ సినిమా కథ ముందు వేరే హీరో కోసం రాసుకోగా అది కాస్త విజయ్ దగ్గరకు వచ్చింది.
ఇంతకీ నిథిలన్ ఈ కథ ఎవరి కోసం రాసుకున్నాడు అంటే అది భాగ్యరాజ తనయుడు శాంతాను భాగ్యరాజ్ కి అని తెలుస్తుంది. శాంతాను తో నిథిలన్ చాలా ఏళ్లుగా పరిచయం ఉందట. ఎన్నో ఏళ్లకు ముందే మహారాజ కథను నిథిలన్ శాంతానుకి చెప్పాడట. అతన్నే హీరోగా పెట్టి చేయాలని అనుకున్నాడట. ఐతే నిథిలన్ స్వామినాథన్ మొదటి సినిమా కురంగు బొమ్మై ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడం వల్ల శాంతానుతో చేయాలనుకున్న సినిమాకు నిర్మాతలు ఎవరు ముందుకు రాలేదట.
చాలామంది నిర్మాతల దగ్గరకు వెళ్లడం నిరుత్సాహంగా రావడం జరిగిందట. ఐతే శాంతాను కాకుండా వేరే హీరో అయితే వర్క్ అవుట్ అవుతుందని నిథిలన్ విజయ్ సేతుపతిని కలిసి కథ వినిపించగా ఆయన కొన్ని మార్పులను సూచించగా అవి బాగుండటంతో అలా చేసి ఫైనల్ గా మహరాజ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి కోట్ల కొద్దీ బడ్జెట్ అవసరం లేదు మంచి స్క్రీన్ ప్లే ఉంటే చాలని ప్రూవ్ చేశారు.
ఈ సినిమా తమిళం తో పాటుగా తెలుగులో కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఏదో సరదాగా చూద్దాం అనుకున్న ఆడియన్స్ కు సినిమాలో డైరెక్టర్ మెయింటైన్ చేసిన సస్పెన్స్ చివర్లో ట్విస్ట్.. ముఖ్యంగా స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఇవన్నీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయి. అందుకే విజయ్ సేతుపతి ఈ సినిమా చేశాడు. కథాబలం ఉన్న సినిమాలు ఎక్కడైనా ఎప్పుడైనా సరే ప్రేక్షకులు మనసులు గెలుస్తాయని మరోసారి మహారాజ ప్రూవ్ చేసింది. ఓ పక్క డిఫరెంట్ సినిమాల్లో లీడ్ రోల్ చేస్తూనే విజయ్ సేతుపతి స్టార్ సినిమాల్లో విలన్ గా చేస్తూ వస్తున్నాడు. ఐతే రీసెంట్ గా కొన్ని సినిమాల్లో ప్రతినాయకుడిగా చేసిన ఆయన ఇక మీదట అలాంటి పాత్రలు చేయకూడదని డిసైడ్ అయినట్టు టాక్.