Begin typing your search above and press return to search.

గౌతమ్ - అకిరా - మోక్షజ్ఞ.. యువ హీరో తగలబెట్టే కోరిక!

టాలీవుడ్‌లో నెక్స్ట్ జనరేషన్ వారసుల ఎంట్రీ గురించి అభిమానుల్లో ఆసక్తి ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Tupaki Desk   |   21 March 2025 7:55 PM IST
గౌతమ్ - అకిరా - మోక్షజ్ఞ.. యువ హీరో తగలబెట్టే కోరిక!
X

టాలీవుడ్‌లో నెక్స్ట్ జనరేషన్ వారసుల ఎంట్రీ గురించి అభిమానుల్లో ఆసక్తి ఏ రేంజ్ లో ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరు మొదట కెమెరా ముందు మెరుస్తారు ఎవరు టాలీవుడ్ తెరపై మెరుపులు మెరిపిస్తారు అనే ఆసక్తికర చర్చలు నిత్యం నడుస్తున్నాయి. హీరోల పిల్లలపై ప్రత్యేకమైన అంచనాలు ఉండటం సహజమే. అందుకే స్టార్స్ వారి పిల్లల ఎంట్రీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో అకిరా నందన్, ఘట్టమనేని వారసుడిగా గౌతమ్, నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు వెండితెరపై కనిపిస్తారో అని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే గౌతమ్ చిన్నప్పుడే 1: నేనొక్కడినే సినిమాలో కనిపించినా, తన అసలైన హీరోగా ఎంట్రీ కోసం ఇంకాస్త టైమ్ పట్టేలా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ లాంగ్ టైం నుంచే హాట్ టాపిక్స్ గా నిలుస్తున్నారు. వీరి ఎంట్రీ అయితే ఎంతో దూరంలో లేదు. ఇక ఈ ముగ్గురిలో ఎవరు ముందు వచ్చినా అది టాప్ న్యూస్ అవుతుంది. అలాంటిది ముగ్గురు కలిసి ఒకే సినిమా చేస్తే.. థియేటర్లే తగలబడి పోతాయంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

అలాగే ఇద్దరు కలిసి చేసినా.. అదొక వండర్ అనేలా ఉంటుంది. ఇది సాధ్యమే అయితే టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో రికార్డ్ గా నిలవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో నితిన్ ఈ అంశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఘట్టమనేని గౌతమ్, అకిరా నందన్, మోక్షజ్ఞ ముగ్గురూ కలిసి ఓ మల్టీస్టారర్ చేస్తే చూడాలని ఉందని నితిన్ చెప్పాడు. ముగ్గురిలో ఎవరు ముందుగా ఎంట్రీ ఇస్తారన్న ప్రశ్నకు, ఆయన స్టైల్‌లో ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

నితిన్ కోరిక బాగానే ఉంది కాని, అది జరగాలంటే టైమ్ కలిసి రావాలి. ఇద్దరు కలిసి ఓ సినిమా చేసినా అదిరిపోతుంది. చరణ్ ఎన్టీఆర్ సినిమా చేస్తారని ఎవరు ఊహించి ఉండరు. అలాంటిది వీళ్ళు కూడా చేసే అవకాశం ఉండవచ్చు. ఏదేమైనా నితిన్ మాట భవిష్యత్తులో నిజం కావాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో నితిన్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

పవన్ ఎవరితో సినిమా చేస్తే బాగుంటుంది అని అడిగితే.. రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా పేర్లు చెప్పడమేకాక, సందీప్‌తో చేయడం వల్ల తక్కువ టైంలో సినిమాను పూర్తిచేయవచ్చని చెప్పాడు. ముగ్గురు టాప్ డైరెక్టర్లలో ఒకరిని మాత్రమే ఎంచుకోమంటే చాలా మంది తటస్థంగా ముగ్గురూ అంటారు. కానీ నితిన్ మాత్రం చురుగ్గా ప్రశ్నకు క్వాలిటీ సమాధానం ఇచ్చాడు.