రాబిన్ హుడ్ కోసం ఎవరిని తెస్తున్నారు..?
వెన్యూ, డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ నితిన్ రాబిన్ హుడ్ కోసం వచ్చే గెస్ట్ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు.
By: Tupaki Desk | 19 March 2025 5:39 PM ISTనితిన్ రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న రిలీజ్ కాబోతుంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. రాబిన్ హుడ్ ఒక థీఫ్ కథతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. రాబిన్ హుడ్ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాకు జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
భీష్మ తో వెంకీ కుడుముల, నితిన్ మంచి సక్సెస్ అందుకోగా మళ్లీ అదే కాంబోలో వస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈమధ్య సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ డిఫరెంట్ అటెంప్ట్స్ చేస్తున్నారు. అందుకే రాబిన్ హుడ్ కోసం కూడా వెంకీ నితిన్ ఇద్దరు రకరకాల ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఈ యాక్టివిటీస్ కూడా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్నాయి.
ఐతే మార్చి 28న రిలీజ్ కాబోతున్న రాబిన్ హుడ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో జరగబోతుంది. వెన్యూ, డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ నితిన్ రాబిన్ హుడ్ కోసం వచ్చే గెస్ట్ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. ఈమధ్య ఈవెంట్స్ కి స్టార్స్ ని పిలవడం కన్నా చిత్ర యూనిట్ తోనే కానిచ్చేస్తున్నారు. ఐతే రాబిన్ హుడ్ కోసం తప్పకుండా ఎవరో ఒక స్టార్ ని తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారు మైత్రి మూవీ మేకర్స్.
ఆ నిర్మాణ సంస్థ ఇప్పుడు అన్నీ పెద్ద సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ హిట్లు అందుకుంటున్నారు. సో తప్పకుండా ఈ నిర్మాతలు పిలిస్తే కాదనే ఛాన్స్ ఉండదు. ఇంతకీ నితిన్ రాబిన్ హుడ్ కోసం నిర్మాతలు ఎవరిని తీసుకొస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది.
నితిన్ భీష్మ తర్వాత వరుస సినిమాలు చేశాడు కానీ అవి మంచి ఫలితాలు ఇవ్వలేదు. ఐతే ఈసారి రాబిన్ హుడ్ తో చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు నితిన్. ఛలో, భీష్మతో సూపర్ సక్సెస్ లు అందుకున్న వెంకీ కుడుముల ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. మరి రాబిన్ హుడ్ తో నితిన్ అనుకున్న సక్సెస్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. నితిన్ వెంకీ కుడుముల మాత్రం సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.