Begin typing your search above and press return to search.

వేణు నెక్స్ట్ ఎవరితో?

అయితే ఎల్లమ్మ ప్రాజెక్టు.. ఇప్పుడు యంగ్ హీరో నితిన్ దగ్గరకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   11 Oct 2024 2:30 PM GMT
వేణు నెక్స్ట్ ఎవరితో?
X

వేణు ఎల్దండి.. బలగం మూవీతో ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. అప్పటివరకు మంచి కమెడియన్ గా అలరించిన ఆయన.. బలగం తర్వాత క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో మూవీని తెరకెక్కించి అందరినీ ఆకట్టుకున్నారు. సహజసిద్ధమైన తెలంగాణ పల్లెటూరి ఎమోషన్స్ పండిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఎన్నో అవార్డులు దక్కించుకుని.. భారీ వసూళ్లను రాబట్టింది బలగం.

అయితే బలగం తర్వాత అందరి దృష్టి వేణు అప్ కమింగ్ చిత్రాలపై పడింది. ఆయన రెండో మూవీ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ అవ్వగా.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించనున్నారు. ఎల్లమ్మ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కానీ హీరో ఎవరన్నది ఇప్పటికీ ఖరారు కాలేదు. నేచురల్ స్టార్ నానితో వేణు తన రెండో మూవీ చేయనున్నారని జోరుగా ప్రచారం సాగింది. ఇద్దరు కలిసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నానికి వేణు స్టోరీ కూడా నేరేట్ చేశారని టాక్ వినిపించింది. కానీ వాళ్ళ ఇద్దరి కాంబో ఫిక్స్ కాలేదు. సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నాని ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు. వేణుతో మూవీ ఇంకా ఫిక్స్ కాలేదని, ఫ్యూచర్ లో మాత్రం ఆయనతో వర్క్ చేస్తానని చెప్పారు. అయితే ఎల్లమ్మ ప్రాజెక్టు.. ఇప్పుడు యంగ్ హీరో నితిన్ దగ్గరకు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు.. వేణు, నితిన్ కాంబో ఓకే అయ్యేలా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నితిన్.. దిల్ రాజు ప్రొడక్షన్ లోనే తమ్ముడు మూవీ చేస్తున్నారు.

దీంతో నితిన్.. వేణు సెకండ్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. అదే సమయంలో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్.. రీసెంట్ గా వేణు దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పారట. వేణు చెప్పిన స్టోరీ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ శర్వానంద్ కు చెప్పిన స్టోరీ.. నితిన్ కి చెప్పిన స్టోరీ ఒకటా కాదా అన్న విషయం తెలియదు.

మొత్తానికి బలగం వచ్చి కొన్ని నెలలు అవుతున్నా.. వేణు నెక్స్ట్ మూవీ ఎవరితో అన్నది ఇంకా ఖరారు కాలేదు. మరికొద్ది రోజుల్లో ప్రకటన రానుందని సమాచారం. రీసెంట్ గా ఓ వేడుకలో వేణు.. ఎల్లమ్మ ప్రాజెక్టుపై స్పందించారు. విలక్షణమైన హాస్య శైలిలో స్క్రిప్ట్ సిద్ధం చేశానని తెలిపారు. త్వరలో షూటింగ్ ప్రారంభించవచ్చని చెప్పారు. వెంటనే దిల్ రాజు ఫిబ్రవరిలో షూట్ స్టార్ట్ అవుద్దని ఇన్ డైరెక్ట్ గా అన్నారు. మరి ఎల్లమ్మ సినిమా ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.