Begin typing your search above and press return to search.

శ్రీలీల స్టెప్పుతో వార్నర్, నితిన్ డ్యాన్స్.. రాబిన్ హుడ్ బజ్ టాప్ గేర్ లో!

ఇక క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 March 2025 11:08 AM
Nithin Sreeleela David Warner viral video
X

టాలీవుడ్ యూత్‌ఫుల్ హీరో నితిన్, ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల కాంబినేషన్‌లో వస్తున్న 'రాబిన్ హుడ్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 28న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు బాగానే క్లిక్ అయ్యాయి. ఇక క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమోషన్ స్ట్రాటజీ మరింతగా సినిమాకు హైప్ తీసుకువచ్చింది.

ఇటీవలే జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వార్నర్ స్టైలిష్ గెటప్ లో హాజరై అలరించారు. ఆ కార్యక్రమం తర్వాత టీం ప్రమోషన్స్‌ను మరింత క్రియేటివ్‌గా నడిపిస్తూ, సోషల్ మీడియాలో వైరల్ కంటెంట్ అందిస్తోంది. నితిన్, శ్రీలీల, వార్నర్‌ల ముగ్గురు కలిసి ఇంటర్వ్యూలు, ప్రొమో షూట్స్‌లో పాల్గొంటూ మజా చేశారు. ఇప్పుడు అదే ట్రాక్‌లో ప్రమోషన్స్ మరో లెవెల్‌కు వెళ్లాయి.

తాజాగా శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్ పోస్ట్ చేసింది. "వన్ మోర్ టైమ్" అనే 'రాబిన్ హుడ్' సినిమాలోని మ్యూజిక్‌కు శ్రీలీల డ్యాన్స్ చేస్తూ కనిపించింది. అలా స్టెప్పులేస్తూ డేవిడ్ వార్నర్, నితిన్ దగ్గరకు వెళ్లిన శ్రీలీల.. వారిద్దరినీ స్టెప్పులేయమని తన స్టైల్‌లో ఓ చూపుతో కోరింది. వెంటనే వార్నర్, నితిన్ ఇద్దరూ ఆమెతో కలిసి అదే బీట్‌కు డ్యాన్స్ చేయడం వైరల్‌గా మారింది.

వీడియోలో వార్నర్ ఎక్స్ ప్రెషన్, నితిన్ ఎంజాయ్ చేస్తున్న మూడ్‌కి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇది చూసిన అభిమానులు "రాబిన్ హుడ్ టీం గమ్మత్తుగా ఉంది", "ఈ మ్యూజిక్ బీట్ యూథ్‌ని ఊపేస్తోంది", "వార్నర్‌కు డ్యాన్స్ కూడా వచ్చా!" అంటూ కామెంట్లు చేస్తున్నారు. డ్యాన్స్ వీడియో పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండ్ అవుతోంది.

శ్రీలీల వేర్ చేసిన పింక్ డ్రెస్, ఫోజులు, ఎనర్జీ కూడా ఫాన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇక సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ మంచి పాజిటివ్ బజ్ వినిపిస్తోంది. సెన్సార్ U/A సర్టిఫికెట్‌తో క్లియర్ అయిన ఈ చిత్రం, ఫన్ అండ్ ఎమోషన్స్ మిక్స్‌తో మాస్ యూత్ ఆడియన్స్‌ను అలరించబోతోందని ఇండస్ట్రీలో టాక్. డేవిడ్ వార్నర్ క్యామియో, శ్రీలీల డ్యాన్స్‌లతోపాటు నితిన్ మాస్ అవతార్ ప్రేక్షకులకు పండుగలా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ‘రాబిన్ హుడ్’ బాక్సాఫీస్ దాడికి రెడీగా ఉంది.