పవన్ హిట్ టైటిల్‌తో నితిన్ కొత్త మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?
నితిన్‌కు పవన్ కల్యామ్ అంటే ఎంతో ఇష్టమో తెలిసిన విషయమే. ఆయనకు నితిన్ వీరాభిమాని. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చాడు.
By: Tupaki Desk | 27 Aug 2023 11:10 AM GMTటాలీవుడ్ హీరో నితిన్ రీసెంట్గా మాచర్ల నియోజకవర్గం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడాయన తన కొత్త సినిమాను ప్రకటించడంతో పాటు సెట్స్‌పైకి కూడా తీసుకెళ్లారు. 'వకీల్ సాబ్' ఫేమ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్‌తో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించారు.
సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి చిత్రబృందంతో పాటు దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి సహా పలువురు హాజరై సందడి చేశారు. మూవీటీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
అయితే ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో సినీ ప్రియుల్లో అంచనాలను పెంచేశారు మేకర్స్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ 'తమ్ముడు' టైటిల్‌ను తమ చిత్రానికి ఖరారు చేశారు.
ఈ విషయాన్ని హీరో నితిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 'కొన్ని టైటిల్స్ ఎంతో బాధ్యతను పెంచేలా వస్తాయి. ఈ సినిమా మీ అంచనాలను మించేలా ఉంటుంది. నా కొత్త సినిమా వేణు శ్రీరామ్, దిల్ రాజు గారితోనే' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.
నితిన్‌కు పవన్ కల్యామ్ అంటే ఎంతో ఇష్టమో తెలిసిన విషయమే. ఆయనకు నితిన్ వీరాభిమాని. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కూడా చెప్పుకొచ్చాడు. అందుకే ఇప్పుడు పవన్ టైటిల్ రానుండటం వల్ల మూవీ ఫ్యాన్స్ ఆశలు పెట్టేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నట్లు సమాచారం అందింది. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ మెదలు పెడతారని తెలిసింది. అలాగే సినిమాలో నటించే నటీనటులు, పని చేయబోయే ఇతర టెక్నీషియన్ల వివరాలను తెలియజేయనున్నారు.
ఇంకా నితిన్ ఈ సినిమాతో పాటు పలు చిత్రాలను చేస్తున్నారు. 'భీష్మ' తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచస్తున్న ఆయన.. ప్రస్తుతం వెంకీ కుడుములతో ఓ చిత్రం, వక్కంతం వంశీతో మరో సినిమా చేస్తున్నారు. ఇవి రెండు సెట్స్‌పైన ఉన్నాయి. ఈ మూడు చిత్రాలతో ఎలాగైనా గట్టి సక్సెస్‌ను అందుకోవాలని నితిన్ ప్రయత్నిస్తున్నారు.