నిత్యామీనన్ ని లావుగా..పొట్టిగా..బండలా ఉందన్నారా?
తన రూపం విషయంలో మార్పులు అవసరమని కొందరు సూచించారుట. పాఠశాల, కళాశాల రోజుల్లో తన జుత్తు వెరైటీగా ఉందేంటని చాలా మంది వింతగా మాట్లాడుకునేవారుట.
By: Tupaki Desk | 14 April 2025 6:06 AMనేచురల్ పెర్పార్మర్ నిత్యామీనన్ స్టిల్ ఇంకా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు గానీ.. కోలీవుడ్..మాలీవుడ్లో మాత్రం సినిమాలు చేస్తోంది. ధనుస్ సరసన `ఇడ్లీ కడై`లో నటిస్తోంది. అయితే ఈ సినిమా సహా ఇండస్ట్రీ కాలేజీ రోజుల్లో తాను ఎదుర్కున్న విమర్శల గురించి ఒక్కసారి గుర్తు చేసుకుంది. ఎన్ని విమర్శలు ఎదురైనా వాటిని స్వీకరించిన నిరూపించుకోవడం మాత్రమే తెలుసునంటోంది.
తన రూపం విషయంలో మార్పులు అవసరమని కొందరు సూచించారుట. పాఠశాల, కళాశాల రోజుల్లో తన జుత్తు వెరైటీగా ఉందేంటని చాలా మంది వింతగా మాట్లాడుకునేవారుట. నడుచుకుంటూ వెళ్లే సంద ర్భంలో ఎంతో వింతగా ఉందని అదే పనిగా తన జుత్తువైపు చూసేవారుట. తొలి సినిమా షూటింగ్ సమయంలో మీ జుట్టు ఇలా ఉందేంటని అడిగేవారుట. కాల క్రమంలో అదే జుట్టుకు ఎంతో మంది అభిమానులు ఏర్పాడ్డారంది.
ఇండస్ట్రీలో ఈ రకమైన హెయిర్ స్లైట్ చాలా తక్కువ మందికి ఉండటం తనకు కెరీర్ పరంగా చాలా కలిసొచ్చిందని తెలిపింది. అలాగే పొట్టిగా..లావుగా..బండగా ఉందనే విమర్శలు కాలేజ్ సహా పరిశ్రమలో చాలా కాలం పాటు ఎదుర్కున్నానని తెలిపింది. కను బొమ్మలు వెరైటీగా ఉన్నాయని మరికొంత మంది ఇష్టారీతున మాట్లాడేవారంది. ఈ మాటలను తనని ఎంతో ప్రభావితం చేసాయంది. ప్రభావితం చేయాలి కూడా అంది.
అప్పుడే ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కునే ధైర్యం, సత్తా కలుగుతాయంది. విమర్శలొచ్చాయని ఏనాడు రూపాన్ని మార్చుకునే ప్రయత్నం చేయలేదంది. పుట్టకతో వచ్చింది చనిపోయే వరకూ పోదు అంటారు. అలాంటప్పుడు బాధపడా ల్సిన పనేముంది. నాలాగే ఉంటూ నన్ను నిరూపించుకోవాలని ఆనాడే డిసైడ్ అయ్యానని...విమర్శలను కూడా ప్రశంసల్లా తీసుకుని ముందుకెళ్తున్నానంది. కానీ శారీరక రూపాన్ని బట్టి మనిషిని అంచనా వేయడం అన్నది సరైన పద్దతి కాదని అభిప్రాయపడింది.