ఒక శకం ముగిసిందంటూ నిత్యామీనన్ ఎమోషన్
ఇటీవలే పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ లో గడుసు పిల్లగా నటించి మెప్పించింది నిత్యా మీనన్.
By: Tupaki Desk | 16 July 2023 6:28 AM GMTఇటీవలే పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ లో గడుసు పిల్లగా నటించి మెప్పించింది నిత్యా మీనన్. కెరీర్ ఆద్యంతం ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించిన నిత్యా మీనన్ కి తన అమ్మమ్మ తాతయ్యలతో ఉన్న అనుబంధం ఎంతో గొప్పది. తాజా సమాచారం మేరకు నిత్యా ఇంట విషాదం నెలకొంది. తనకు ఎంతో ఇష్టమైన అమ్మమ్మను కోల్పోయానని నిత్యా స్వయంగా సోషల్ మీడియాల్లో వెల్లడించింది. ఈ సందర్భంగా నిత్యా భావోద్వేగ పోస్ట్ అభిమానులను కలచివేస్తోంది.
నిత్యా ఇన్ స్టాలో అమ్మమ్మతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ... ``ఒక శకం ముగిసింది. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను. గుడ్ బై అమ్మమ్మ.. మైచెర్రీమ్యాన్ ను బాగా చూసుకుంటాను`` అంటూ ఉద్విగ్నతను కనబరిచింది. నిత్యా ఇంట విషాదం గురించి తెలుసుకున్న అభిమానులు తనకు సోషల్ మీడియాల్లో ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అలా మొదలైంది చిత్రంతో కెరీర్ ని ప్రారంభించిన నిత్యా ఇష్క్- గుండె జారి గల్లంతయ్యిందే- సన్నాఫ్ సత్యమూర్తి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన భీమ్లా నాయక్ లో గడుసైన భార్యామణిగా నటించి మెప్పించింది. టాలీవుడ్ లో అప్పుడప్పుడు పరిమితంగా నటిస్తున్న నిత్యా ఇటీవల మాలీవుడ్ కోలీవుడ్ లో బిజీ అయింది. మరోవైపు వెబ్ సిరీస్ లలోను నటిస్తోంది.