Begin typing your search above and press return to search.

ఇడ్లీ కొట్టు ఆమె మాత్రమే ఎందుకంటే..?

ధనుష్ డైరెక్షన్ లో రాబోతున్న ఇడ్లీ కడై సినిమాలో నిత్యా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   15 Oct 2024 10:30 PM GMT
ఇడ్లీ కొట్టు ఆమె మాత్రమే ఎందుకంటే..?
X

మలయాళంలో నటిగా కెరీర్ మొదలు పెట్టి తెలుగు, తమిళ సినిమాలతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ నిత్యా మీనన్. తెలుగులో అలా మొదలైంది సినిమాతో తన కెరీర్ మొదలు పెట్టిన అమ్మడు తన సహజ నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఐతే కెరీర్ లో కొన్నాళ్లు సరైన ఫాం లో లేని ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ తమిళ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది. తమిళ్ లో తిరు సినిమాతో లాస్ట్ ఇయర్ సందడి చేసిన నిత్యా మీనన్ ఆ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది.

ఐతే ఇప్పుడు మళ్లీ ధనుష్ తో మరో సినిమా ఛాన్స్ అనుకుంది ఈ అమ్మడు. ధనుష్ డైరెక్షన్ లో రాబోతున్న ఇడ్లీ కడై సినిమాలో నిత్యా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. ఈ సినిమా గురించి చెబుతూ నిత్యా మీనన్ కొత్త ప్రయాణం మొదలైంది అంటూ సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్ వైరల్ గా మారింది. ధనుష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిత్యా స్పెషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు.

ఇడ్లీ కొడై టైటిల్ చూస్తేనే మరోసారి ధనుష్ ఒక మంచి మట్టి కథ చెప్పబోతున్నాడని అనిపిస్తుంది. ఈమధ్యనే రాయన్ తో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ మరోసారి తన డైరెక్షన్ టాలెంట్ తో మెప్పించాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో ధనుష్ కి జోడీగా నిత్యాని సెలెక్ట్ చేశారు. నిత్యా మీనన్ కూడా ఈ ఆఫర్ తో మళ్లీ తన నటనతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయాలని చూస్తుంది.

రాయన్ ఇచ్చిన బూస్టింగ్ తో తన దగ్గర ఉన్న కథలన్నీ సొంత డైరెక్షన్ లో చేయాలని ఫిక్స్ అయిన ధనుష్ ఇడ్లీ కొడై సినిమాతో కూడా తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు. ఇక ఈ సినిమా కథ ఏంటి.. మిగతా కాస్టింగ్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. సినిమా కోసం ధనుష్ మేకోవర్ చూపిస్తున్నాడని తెలుస్తుంది. ధనుష్ ప్రస్తుతం కుబేర సినిమా చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

సౌత్ లో మంచి నటిగా క్రేజ్ తెచ్చుకున్న నిత్యా మీనన్ ఈమధ్య పూర్తిగా ఫేడవుట్ అయినట్టు అనిపించినా మళ్లీ తనకు వచ్చిన అవకాశాలతో తన సత్తా చాటుతుంది. తప్పకుండా అమ్మడికి ఈ ఛాన్స్ మళ్లీ మళ్లీ అవకాశాలు వచ్చేలా చేస్తుందని చెప్పొచ్చు.