మాసిన బట్టలతోనే మెగాస్టార్ షూటింగ్!
బాల నటి నిత్యా శెట్టి సుపరిచితమే. 'చిన్నిచిన్ని ఆశ'తో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన నిత్యా శెట్టి అటుపై 'దేవుళ్లు', 'లిటిల్ హార్స్ట్', ' దాగుడు మూతలు దండాకోర్' లాంటి సినిమాల్లో నటించింది.
By: Tupaki Desk | 7 March 2025 12:30 PMబాల నటి నిత్యా శెట్టి సుపరిచితమే. 'చిన్నిచిన్ని ఆశ'తో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన నిత్యా శెట్టి అటుపై 'దేవుళ్లు', 'లిటిల్ హార్స్ట్', ' దాగుడు మూతలు దండాకోర్' లాంటి సినిమాల్లో నటించింది. అటుపై హీరోయిన్ గానూ ప్రమోట్ అయింది. 'నువ్వు తోపురా', 'ఓ పిట్టకథ'లాంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. కోలీవుడ్లో కూడా కొన్ని సినిమాలు చేసింది. అక్కడ కూడా బాల నటిగా కొన్ని సినిమాలు చేసింది.
ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు రాలేదు. సినిమాలు చేసి ఐదేళ్లు అవుతుంది. సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలతో నెటి జనుల్లో సెగలు పుట్టిస్తుంటుంది. ఇన్ స్టా లో క్రేజీ బ్యూటీగా ఫేమస్ అయి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో ఓ ఉన్న ఓ జ్ఞాపకాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ సోషియా ఫాంటసీ చిత్రం 'అంజి' తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
అప్పట్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన చిత్రం పెద్దగా విజయం సాధించలేదు. కానీ చిరు కెరీర్ లో మరో ప్రయోగాత్మక చిత్రంగా మిగిలిపోయింది. అయితే ఈ చిత్రంలో నిత్యశెట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. నిత్య అనే పాత్ర పోషించింది. కాగా ఈసినిమా షూటింగ్ సమయంలో చిరంజీవి మాసిన బట్టలతోనే షూటింగ్లో పాల్గొనేవారని నిత్య శెట్టి తెలిపింది.
'బట్టలు బాగా మాసిపోయి రోజులు గడిచినా? పాత్ర కోసం ఆ మాసిన పాత బట్టలే వేసుకోవడం చూసి షాక్ అయ్యానంది. చిరంజీవి లాంటి స్టార్ అలాంటి బట్టలు వేసుకోవడం ఏంటి? అనుకునే దాన్ని. ఆయనే అంత సింపుల్ గా ఉంటే మాలాంటి వాళ్లు ఇంకెలా ఉండాలి. ఎంతో గొప్ప నటుడు ఆయన. ఆయన కమిట్ మెంట్..డెడికేషన్ మాములుగా ఉండదు. ఎంతో ఫోకస్డ్ గా పనిచేస్తారు. కెమెరా ముందు కొచ్చారంటే? ఆయన మనసులో ఎలా నటించాలి అనే తపన తప్ప మరో ఆలోచన ఉండదు` అని అంది.