Begin typing your search above and press return to search.

ఆ సూప‌ర్ న‌టుడికి జోడీగా జాతీయ ఉత్త‌మ న‌టి!

ఈ నేప‌థ్యంలో తాజాగా నిత్యామీన‌న్ ...మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న ఓ సినిమాకి ఎంపికైన‌ట్లు స‌మాచారం.

By:  Tupaki Desk   |   24 Aug 2024 3:30 PM GMT
ఆ సూప‌ర్ న‌టుడికి జోడీగా జాతీయ ఉత్త‌మ న‌టి!
X

ఇటీవ‌లే నిత్యామీన‌న్ జాతీయ ఉత్త‌మ న‌టిగా ఎంపికైన సంగ‌తి తెలిసిందే. అవార్డుపై ఎలాంటి ఆశ‌లు పెట్టుకోని అమ్మ‌డికి అవార్డు వ‌రించ‌డంతో నిత్యామీన‌న్ ఆనందానికి అవ‌ధుల్లేవ్. దీంతో అమ్మ‌డి పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగింది. ఇంత‌వ‌ర‌కూ సౌత్ వ‌ర‌కే ప‌రిమిత‌మైన అమ్మ‌డి క్రేజ్ జాతీయ ఉత్త‌మ‌న‌టి అవార్డుతో దేశ వ్యాప్తంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో తాజాగా నిత్యామీన‌న్ ...మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న ఓ సినిమాకి ఎంపికైన‌ట్లు స‌మాచారం. పాండిరాజ్ ద‌ర్శ‌కత్వంలో ఓ సినిమాకి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇందులో హీరోయిన్ ఎంపిక‌పై కొన్ని నెల‌లుగా క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. చాలా మంది భామ‌ల పేర్లు ప‌రిశీలించారు. చివ‌రిగా నిత్యామీన‌న్ న తీసుకోవాల‌ని అమ్మ‌డికి జాతీయ అవార్డు రాక‌ముందే అనుకున్నారు.

ఇంత‌లో అవార్డు ప్ర‌క‌ట‌న కూడా జ‌రిగింది. దీంతో నిత్యామీన‌న్ కి అవ‌కాశం ఖాయ‌మైంది. విజ‌య్ సేతుప‌తి కి జోడీగా నిత్య ప‌ర్పెక్ట్ సూటువుతంది. వ‌య‌సు ప‌రంగానూ అమ్మ‌డు స‌రితూగుతుంది. విజ‌య్ సేతుప‌తి వ‌య‌సు 46 కాగా..నిత్యామీన‌న్ ఏజ్ 36. ఇద్ద‌రి మధ్య ప‌దేళ్లు గ్యాప్ ఉంది. నిత్యామీనన్ కొంత కాలంగా మ‌ల‌యాళంలోనే సినిమాలు చేస్తోంది. మ‌ళ్లీ ఈ మ‌ధ్య‌నే కోలీవుడ్ పై దృష్టి పెట్టింది.

ఇప్ప‌టికే 'డియ‌ర్ ఎక్సెస్', 'కాధ‌లిక నేరిమ‌లై' అనే సినిమాల‌కు సైన్ చేసింది. ప్ర‌స్తుతం ఆ రెండు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఇవి ఇదే ఏడా రిలీజ్ కానున్నాయి. ఈనేప‌థ్యంలో తాజాగా పాండిరాజ్ ప్రాజెక్ట్ కి ఒకే అవుతుంది. ఈ చిత్రాన్ని భారీ కాన్సాస్ పైనే ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.