రాబిన్ హుడ్ రిలీజ్ కోసం నితిన్ విశ్వ ప్రయత్నం!
ముందు చెప్పిన తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని యోచిస్తున్నట్లు సమాచారం. కావాలంటే నైజాం ఏరియా హక్కులు తానే తీసుకుంటానని నితిన్ పట్టు పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 11 Dec 2024 8:15 AM GMTటాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్.. త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్.. కొద్ది రోజుల క్రితమే అనౌన్స్ చేశారు.
రాబిన్ హుడ్ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా.. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే వెంకీ, నితిన్ కాంబోలో వచ్చిన భీష్మ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో రాబిన్ హుడ్ పై అంతా మంచి అంచనాలు పెట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.
రీసెంట్ గా ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. అడ్వెంచర్ అండ్ హైలీ ఎంటర్టైనింగ్ టీజర్ ను రిలీజ్ చేశారు. సినిమాపై హైప్ క్రియేట్ అయ్యేలా కూడా చేశారు. వన్ మోర్ టైమ్ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయగా.. మంచి స్పందన వచ్చింది. రెండో పాట అది దా సర్ప్రైజ్ ను నిన్ననే రిలీజ్ అవ్వాల్సి ఉన్నా.. అవ్వలేదు.
అయితే కొద్ది గంటలుగా రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ వాయిదా పడుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకే సాంగ్ రిలీజ్ కూడా వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. కొత్త ఏడాదిలో మూవీ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపించింది. రిపబ్లిక్ డే సీజన్ లో భాగంగా జనవరి 25వ తేదీన రిలీజ్ చేయనున్నారని గుసగుసలు వినిపించాయి.
బిజినెస్ కు సంబంధించిన కారణాల వలన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ మాట్లాడుకుని డేట్ మార్చే ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఇక రాబిన్ హుడ్ మూవీని అనుకున్న ప్రకారమే విడుదల చేయాలని హీరో నితిన్ భావిస్తున్నారట. ముందు చెప్పిన తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవాలని యోచిస్తున్నట్లు సమాచారం. కావాలంటే నైజాం ఏరియా హక్కులు తానే తీసుకుంటానని నితిన్ పట్టు పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక సినిమా విషయానికొస్తే.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.