రామాయణం రెండు కాదు అంతకు మించి
`మహాభారతం`..`రామాయణం` ఒకటి రెండు భాగాల్లో చెప్పే కథలు కాదు. వాటికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది.
By: Tupaki Desk | 21 May 2024 5:29 AM GMT`మహాభారతం`..`రామాయణం` ఒకటి రెండు భాగాల్లో చెప్పే కథలు కాదు. వాటికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అందుకే వాటిని టచ్ చేయాలంటే దర్శక-రచయితలు ఎంతగానో ఆలోచన చేస్తారు. తమ వల్ల అవుతుందా? లేదా? అని అన్నిరకాలుగా విశ్లేషించుకుని రంగంలోకి దిగుతుంటారు. దర్శకశిఖరం రాజమౌళికి మహాభారాతాన్ని వెండి తెరకెక్కించాలని కలలు కంటున్నారు.
కానీ తనకున్న సామార్ధ్యం తో ఇప్పుడే అది సాధ్యం కాదని...తాను ఇంకా పరిణితి చెందితే తప్ప చేయలేనని నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని చెప్పారంటే? అలాంటి కథలకి దృశ్యరూపం తీసుకురావాలంటే ఎంతగా గ్రౌండ్ వర్క్ చేయాలో స్పష్టమవుతుంది. రాజమౌళిలాగే బాలీవుడ్ లో మరికొంత మంది దర్శకులు సైతం ఇలాగే వెనకడుగు వేసారు. అయితే నితీష్ తివారీ మాత్రం వాళ్లందరికీ భిన్నంగా ధైర్యంగా ముందడుగు వేసి రామాయణాన్ని వెండి తెరకు ఎక్కించే ప్రయత్నం ఇటీవలే షురూ చేసిన సంగతి తెలిసిందే.
రణబీర్ కపూర్..సాయిపల్లవి..యశ్ ప్రధాన పాత్రల్లో ఈ ఇతిహాసాన్ని పట్టాలెక్కించారు. ప్రస్తుతం ఆ సినిమా సెట్స్ లో ఉంది. తొలుత ఈ కథని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. తాను చెప్పాల్సిన కథనంతటిని రెండు భాగాలుగా క్రోడీకరించుకుని చిత్రీకరిస్తున్నట్లు ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందు నితీష్ రివీల్ చేసారు. అయితే సెట్స్ కి వెళ్లిన తర్వాత రెండు భాగాలుగా ఆ కథని చెప్పడం సాధ్యం కాదని దాన్ని ఇప్పుడు మూడు భాగాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
మొదటి భాగంలో సీతారాములు కళ్యాణం.. రెండో భాగంలో సీత పహారణం..మూడవ భాగంలో లంక నుంచి సీతను తీసుకురావడంగా విభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ విభజన మేరకే షూటింగ్ చేస్తున్నారుట. ప్రతీ భాగాన్ని ఎంతో గొప్పగా చూపించాల్సిన అవసరం ఉంది. శ్రీరాముడి ఔన్నత్యాన్ని...సీగ గొప్పదనాన్ని...రావణుడి అపార తెలివితేటల్ని ఎంతో వైవిథ్యంగా చూపించాలి. వాటికి అద్భుతమైన దృశ్యరూపాన్ని తీసుకురావాలి.
పాత్రల ఆహార్యం దగ్గర నుంచి సన్నివేశాల షూట్ వరకూ ప్రతీది ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన పనలు. అటుపై సీజీవర్క్ కూడా అంతకు మించి కీలకం. విఎఫ్ ఎక్స్ సహజత్వాన్ని ఎక్కడా కోల్పోకుండా ఉండాలి. ఇలా చూపించాలంటే కథని రెండు భాగాలుగా చెప్పడం సాధ్యం కాదని ఈనేపథ్యంలో మూడు భాగాలు చేస్తున్నట్ల తెలుస్తోంది. అలాగే షూటింగ్ కూడా మొదటి భాగం పోస్ట్ ప్రొడక్షన్ తో సహా పూర్తి చేసి రిలీజ్ చేసిన తర్వాతే రెండవ భాగం షూట్ మొదలు పెట్టాలని కొత్త స్ట్రాటజీ ముందుకెళ్తున్నట్లు సమాచారం.