నివేతా పేతురాజ్ స్టైలిష్ సింప్లిసిటీ.. విజువల్ ట్రీట్!
సింప్లిసిటీ లోనే స్టైలిష్‌గా ఉండే ఆమె లుక్ ఫ్యాషన్ కి కొత్త నిర్వచనం ఇస్తుంది.
By: Tupaki Desk | 13 Nov 2024 2:30 AM GMTసినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. కానీ అందులో నటిగా నివేతా పేతురాజ్ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. నటనతో పాటు ఆమె మోడర్న్ లుక్స్ తో ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకుంటుంది. తాజాగా నివేతా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలు ప్రస్తుతం ఫ్యాన్స్ మధ్య చర్చనీయాంశంగా మారాయి. సింప్లిసిటీ లోనే స్టైలిష్‌గా ఉండే ఆమె లుక్ ఫ్యాషన్ కి కొత్త నిర్వచనం ఇస్తుంది.
వీటిలో ఆమె స్టైలిష్ మరియు క్లాసిక్ లుక్ తో ఆకట్టుకుంటోంది. సాఫ్ట్ గ్రీన్ కలర్ స్వెటర్ ధరించి కూల్ వైబ్ లో కనిపిస్తున్న నివేతా, మామూలుగా కాకుండా ఎక్స్‌ప్రెషన్ తో డిఫరెంట్ సైడ్ చూపిస్తుంది. ఈ ఫోటోలలో ఆమె ముఖం పై ఒదిగిన సింపుల్ లుక్ కి ఫ్యాన్స్ నుండి విశేష స్పందన వచ్చింది. తన చేతిపై ఉన్న చిన్న టాటూ, గోల్డెన్ వాచ్ మరియు లైట్ షేడ్ మేకప్ తో సింప్లిసిటీని మెయిన్‌టైన్ చేసిన ఆమె, క్యూట్ గా నవ్వుతూ కాప్షన్ ఇచ్చారు. "Y'all ok?" అని ఆమె ప్రశ్నిస్తూ పెట్టిన ఫోటోపై ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తూ ఆమె స్టైల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఆమె స్కిన్ టోన్, జ్యూయెలరీ ఎంపిక మరియు లైట్ మేకప్ అందరికీ ఆకర్షణీయంగా అనిపించింది. తన కెరీర్ విషయానికి వస్తే, నివేతా తమిళ్, తెలుగు భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మొదట తమిళ చిత్రంతో తెరంగేట్రం చేసినా, తెలుగులో పాగల్ వంటి సినిమాలతో మంచి క్రేజ్ పొందింది. ఆమె చేసిన ప్రతీ పాత్రలో ఒక ప్రత్యేకత ఉండటంతో ఆమె ఫ్యాన్ బేస్ ని మరింత పెంచింది.
డిఫరెంట్ రోల్స్, మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. నివేతా పేతురాజ్ ఫ్యాషన్ పరంగా కూడా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. సాధారణమైన డ్రెస్సుల్లోనే స్టైలిష్ గా ఉండే ఈ భామ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. తాజా ఫోటోషూట్లో ఆమె వాచీ, సింపుల్ జ్యూయెలరీ కలిపి స్టైలిష్ లుక్ ను మలిచింది. ఫ్యాన్స్ ఆమె సింప్లిసిటీ లోనే ఉన్న సొగసును పొగిడారు.