నాన్న సెంచరీ కొట్టమన్నారు..కానీ నేను 99 ఔట్!
మలయాళం బ్యూటీ నివేధా థామస్ కి రెండేళ్లగా తెలుగులో అవకాశాలు రాని సంగతి తెలిసిందే. అమ్మడు చివరిగా `శాకినీ డాకినీ`లో నటించింది.
By: Tupaki Desk | 1 Sep 2024 2:30 PM GMTమలయాళం బ్యూటీ నివేధా థామస్ కి రెండేళ్లగా తెలుగులో అవకాశాలు రాని సంగతి తెలిసిందే. అమ్మడు చివరిగా `శాకినీ డాకినీ`లో నటించింది. అంతకు ముందు `వకీల్ సాబ్` లో కీలక పాత్ర పోషించింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో ఆ సినిమాలో బాగానే ఫేమస్ అయింది. కానీ అవకాశాల పరంగా ఏమాత్రం కలిసి రాలేదు. అటు సొంత పరిశ్రమలోనూ అదే పరిస్థితి. తమిళ్, తెలుగు సినిమాల్లో బిజీ అయిన తర్వాత మాలీవుడ్ కి దూరమైంది.
ఇప్పుడు రెండింటికీ చెడ్డ రేవడిలా కెరీర్ మారింది. తాజాగా అమ్మడు `35 చిన్న కథ కాదు` అనే మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా నివేధ తన చిన్న నాటి సంగతుల్ని పంచుకుంది. చిన్న వయసులో చదువు పరంగా ఒత్తిడికి ఎప్పుడైనా గురయ్యారా? అంటే ఓ సంఘటన గుర్తు చేసుకుంది.
`చిన్నప్పటి నుంచి నటనలో ఉన్నా. ఎప్పుడు ఒత్తిడికి గురి కాలేదు. అలాగని చదువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. మా తమ్ముడి కంటే నేనే బాగా చదివేదాన్ని. ఎప్పుటూ షూటింగ్ లు అంటూ బిజీగా ఉన్నా మా టీచర్లు నాకెంతో సహకరించారు. 10వ తరగతిలో మాత్రం కాస్త ఒత్తిడికి గురయ్యాను. అదీ మా నాన్న వల్ల. మా నాన్నకు టెన్త్ మ్యాథ్స్ లో 99 మార్కులొచ్చాయి. నేను ఎగ్జామ్ కి వెళ్తోన్న సమయంలో ఆ మార్కులు గుర్తు చేసారు.
కానీ నేను మాత్రం మొదటి ప్రశ్నకే తప్పుడు సమాధానం రాసాను. మిగతావన్నీ బాగా రాసాను. దీంతో నాకు మానాన్న కన్నా తక్కువ మార్కులు వస్తాయని చాలా కంగారు పడ్డాను. కానీ నాకు 99 మార్కులే వచ్చాయి. మానాన్నకు సమానంగా రావడంతో ఆందోళన తగ్గింది. లేదంటే చాలా బాధపడేదాన్ని ఏమో. నాకన్నా ఎక్కువ మా నాన్న బాధపడేవారు. ఆ ఒక్క మార్కు తప్పుడు సమాధానంగా కారణంగా పోయింది. లేదంటే మా నాన్న మార్కుల్ని దాటేసేదాన్ని` అని తెలిపింది.