Begin typing your search above and press return to search.

నివేధా థామ‌స్ తో ప‌నిచేయ‌డం ఓ గౌర‌వంగా భావిస్తున్నా! రానా

సినిమాలో ప్ర‌తీ పాత్ర‌కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది. నివేదా థామ‌స్ మ‌రోసారి న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది.

By:  Tupaki Desk   |   8 Sep 2024 12:51 PM GMT
నివేధా థామ‌స్ తో ప‌నిచేయ‌డం ఓ గౌర‌వంగా భావిస్తున్నా! రానా
X

ఇటీవ‌ల రిలీజ్ అయిన '35-చిన్న కథ కాదు' సినిమా మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. విమర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్న చిత్రంగా నిలిచింది. సినిమాకి మంచి రివ్యూలు వ‌చ్చాయి. ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన సినిమాలేవి పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు. కానీ ఈ సినిమా మాత్రం చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యంగా నిలిచింది. సినిమాలో ప్ర‌తీ పాత్ర‌కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది. నివేదా థామ‌స్ మ‌రోసారి న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ సినిమా విజ‌యోత్స‌వ వేడుక‌ను చిత్ర యూనిట్ నిర్వ‌హించింది.

ఈ సంద‌ర్భంగా చిత్ర స‌మ‌ర్ప‌కుడు, న‌టుడు రానా మాట్లాడుతూ..' 35-చిన్న కథ కాదు' సక్సెస్ చాలా తృప్తినిచ్చింది. నివేద థామస్ అద్భుతంగా నటించింది. పెర్ఫార్మెన్స్ తో ఆశ్చర్యపరిచి తన భుజాల‌పై సినిమాని ముందుకు తీసుకెళ్ళింది. త‌న‌తో ప‌నిచేయ‌డం ఓ గౌర‌వంగా భావిస్తున్నా. సురేష్ ప్రొడక్షన్ 'పిట్టగోడ' ద్వారానే విశ్వదేవ్ లాంచ్ అయ్యాడు. 35లో తన నటన సర్ ప్రైజ్ చేసింది. మంచి కథలు చేయాలనే తపన తనని ఇంకా ముందుకు తీసుకెళుతుంది.

చాలా సంవత్సరాల తర్వాత కిడ్స్, ఫ్యామిలీస్ ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ గా చూడటం ఆనందంగా వుంది. దర్శకుడు నందు వలనే ఇది సాధ్యమైయింది. తనలోని ప్యూర్ ఎనర్జీ ఈ సినిమాలో కనిపించింది. ఇలాంటి మంచి కథలు ఎప్పుడూ మీ ముందుకు తెస్తూనే వుంటాం' అన్నారు. హీరోయిన్ నివేద థామస్ మాట్లాడుతూ, ' మేము చాలా థియేటర్స్ ని విజిట్ చేశాం. అన్నిచోట్టా సినిమా ప్రేక్షకులకు గొప్ప అనుభూ తిని పంచుతోంది. నిన్న ఓ సింగిల్ స్క్రీన్ కి వెళ్ళినప్పుడు థియేటర్ మొత్తం నిండిపోయి, చాలా మంది పిల్లలు స్టేజ్ వద్ద ఆడుకోవడం చూసినప్పుడు ఒక నర్సరీ స్కూల్ లో సినిమా ప్లే చేసిన గొప్ప అనుభూతినిచ్చింది. ఇది చిన్న సినిమా కాదని చెప్పడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. స‌క్సెస్ జ‌ర్నీ ఇప్పుడే మొద‌లైంది. ప్ర‌తీ ప్రేక్ష‌కుడికి ద‌గ్గ‌ర‌గా థాంక్స్ చెబుతాం' అన్నారు.

హీరో విశ్వదేవ్ మాట్లాడుతూ.. మంచి సినిమాకి ఆద‌ర‌ణ ఎప్పుడూ ద‌క్కుతుంద‌ని మ‌రోసారి ప్రేక్ష‌కులు నిరూపించారేఉ.థియేటర్స్ లో ఒక ఫెస్టివల్ లా వుంది. సినిమా తమ జీవితాన్ని తెరపై చూపించిందని, మస్ట్ వాచ్ సినిమాని ఆడియన్స్ చెప్పడం చాలా ఆనందంగా వుంది. రానా గారు సినిమాని మరో స్థాయిలో పెట్టారు. యాక్టర్ గా నాకు ఫస్ట్ సక్సెస్ వచ్చింది. నా ఫ్యామిలీ చాలా ఎమోషనల్ అయ్యింది' అన్నారు.

డైరెక్టర్ నంద కిషోర్ ఈమాని మాట్లాడుతూ, ' నా రైటింగ్ డిపార్ట్ మెంట్, మ్యూజిక్ వివేక్ సాగర్, డీవోపీ నికేత్, నివేద, విశ్వదేవ్ ఇలా సినిమాకి ప‌నిచేసిన అంద‌రి వ‌ల్లే సాధ్య‌మైంది' అన్నారు. నిర్మాత సిద్ధార్థ్ రాళ్లపల్లి మాట్లాడుతూ, ' ఇంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ కి రావడం, సినిమాని అనుభూతి చెందడం చూస్తుంటే మా మనసు నిండిపోయింది. నేషనల్ అవార్డ్స్ రావాలని ఆడియన్స్ థియేటర్స్ లో కోరుకుంటున్నారు. వారు కోరుకున్నది నెరవేరుతుందనే నమ్మకం వుంది' అన్నారు మ‌రో నిర్మాత సృజన్ యరబోలు మాట్లాడుతూ, ' యునానిమస్ గా సినిమాకి మంచి రివ్యూస్ వ‌చ్చాయి. సినిమాని చూసిన ఆడియన్స్ మరో పదిమందికి చెప్పి ఇంత మంచి సినిమాని అందరూ చూసే విధంగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు.