Begin typing your search above and press return to search.

పాగల్ బ్యూటీ హై క్లాస్ అందం.. ఫిదా అవ్వాల్సిందే

బారి బడ్జెట్ సినిమాలలో ఆఫర్ వచ్చినా సరే క్యారెక్టర్ లో కంటెంట్ లేకపోతే అమ్మడు అసలు ఒప్పుకోదు.

By:  Tupaki Desk   |   21 Aug 2024 4:50 PM GMT
పాగల్ బ్యూటీ హై క్లాస్ అందం.. ఫిదా అవ్వాల్సిందే
X

సినిమా ఇండస్ట్రీలో అందమైన హీరోయిన్స్ చాలామంది ఉంటారు. అయితే నటిగా మంచి టాలెంట్ తో సినిమాలు చేసేవరు తక్కువమందే ఉంటారు. అందులో నివేతా పేతురాజ్ టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు. బారి బడ్జెట్ సినిమాలలో ఆఫర్ వచ్చినా సరే క్యారెక్టర్ లో కంటెంట్ లేకపోతే అమ్మడు అసలు ఒప్పుకోదు. క్యారెక్టర్ నచ్చితేనే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.


ఇక అమ్మడికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పవచ్చు. ఆమె ఎలాంటి క్యారెక్టర్ చేసినా కూడా అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. విశ్వక్ తో చేసిన పాగల్ సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ అందుకుంది. ఎక్కువగా మీడియం రేంజ్ చిన్న బడ్జెట్ లోనే మంచి కంటెంట్ ఉన్న ప్రాజెక్టులు చేసుకుంటూ వెళుతోంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా ఆమె తన క్యారెక్టర్ తో మాత్రం ఆడియెన్స్ మనసులను గెలుచుకుంటోంది.


ఇక నివేతా పేతురాజ్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గ్లామరస్ లుక్స్ తో స్టన్ అయ్యేలా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం అభిమానుల మధ్య ట్రెండ్ అవుతోంది. తెల్లటి టీ-షర్ట్, స్టైలిష్ రాయ్-బాన్ గ్లాసెస్ తో కార్ సీట్లో కూల్ లుక్ తో కూర్చొని సెల్ఫీలు దిగేసింది. సింపుల్ అయినా స్టైలిష్ చూపుతో, "Been long. Sup!?" అనే క్యాజువల్ క్యాప్షన్ తో ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.


ఈ ఫొటోపై అభిమానుల నుండి విశేషమైన స్పందన వచ్చింది, కామెంట్స్ సెక్షన్‌లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నివేతా పేతురాజ్ అందం గుండెను పాగల్ చేస్తోంది అంటూ ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్ కొంటెగా కామెంట్ చేస్తున్నారు. ఇక ఆమె సినిమా కెరీర్ విషయానికి వస్తే, తన కెరీర్ ప్రారంభాన్ని తమిళ చిత్రపరిశ్రమలో 2016లో విడుదలైన ఓరు నాల్ కోథు సినిమాతో స్టార్ట్ చేశారు.

ఆ తర్వాత తమిళ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటూ, డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. మెంటల్ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, పాగల్ వంటి చిత్రాల్లో ఆమె పాత్రలు ప్రేక్షకులను మెప్పించాయి. ఆమె తన నటనతో పాటు అందంతోనూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమా అవకాశాలు మాత్రమే కాకుండా, నివేతా సోషల్ మీడియా లో కూడా యాక్టివ్ గా ఉంటూ తరచుగా తన ఫొటోషూట్లు, పర్సనల్ లైఫ్ అప్డేట్స్ షేర్ చేస్తుంటారు.