టాప్ 10 బాక్సాఫీస్.. టాలీవుడ్ నైజాం కింగ్స్ ఎవరంటే..
అయితే ఇప్పటివరకు నైజం ఏరియాలో అత్యధిక స్థాయిలో షేర్ కలెక్షన్స్ అందుకున్న టాప్ తెలుగు సినిమాల వివరాల్లోకి వెళితే..
By: Tupaki Desk | 15 July 2023 3:10 PM GMTతెలుగు రాష్ట్రాలలో దాదాపు అన్ని ఏరియాలలో కూడా ఇటీవల కాలంలో మార్కెట్ వాల్యూ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇక తెలంగాణ సైడ్ చూస్తే నైజం మార్కెట్లో అయితే స్టార్ హీరోలు ప్రతిసారి కూడా ఊహించని స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. కంటెంట్ క్లిక్ అయితే కొన్ని చిన్న సినిమాలు కూడా మంచి వసూళ్లను అందుకుంటున్నాయి. అయితే ఇప్పటివరకు నైజం ఏరియాలో అత్యధిక స్థాయిలో షేర్ కలెక్షన్స్ అందుకున్న టాప్ తెలుగు సినిమాల వివరాల్లోకి వెళితే..
రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ RRR ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకదీరుడు రాజమౌళి తెరపైకి తీసుకువచ్చిన ఆ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో అత్యధికంగా ఈ సినిమా 111.85 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ అందుకొని మంచి ప్రాఫిట్ ను అందించింది.
ఇక బాహుబలి 2 సినిమా ఈ రికార్డులో రెండవ స్థానంలో నిలిచింది. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీ నైజాం ఏరియాలో మొత్తంగా 68 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుని అప్పటివరకు ఉన్న రికార్డులన్నిటిని కూడా బ్రేక్ చేసింది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ లోనే అల..వైకుంఠపురములో సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నాడు.
ఇక నైజాం ఏరియాలో ఈ సినిమా 44.88 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకొని టాప్ టెన్ లిస్టులో మూడవ స్థానంలో నిలిచింది.
ఇక బాహుబలి 1, 43 కోట్ల కలెక్షన్స్ తో నైజాం ఏరియాలో 4వ స్థానంలో కొనసాగుతోంది. ఇక డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కూడా KGF సెకండ్ చాప్టర్ తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు కేవలం నైజాం ఏరియాలోనే మొత్తంగా 42 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా 40 కోట్లకు పైగానే నైజాం ఏరియాలో కలెక్ట్ చేయగా.. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు 39 కోట్లు అందుకుంది.
ఇటీవల వచ్చిన ఆదిపురుష్ సినిమాకు నెగిటివ్ టాక్ గట్టిగానే వచ్చింది. అయినప్పటికీ ప్రభాస్ తన క్రేజ్ తో నైజాం ఏరియాలో 36 కోట్ల షేర్ వచ్చేలా చేశాడు. మెగాస్టార్ వాల్తేరు వీరయ్య 36.25 కోట్లను అందుకుంది. ఇక నైజాం ఏరియాలో పదవ స్థానంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ 35 కోట్ల కలెక్షన్స్ తో కొనసాగుతోంది.