Begin typing your search above and press return to search.

డబుల్ ఇస్మార్ట్.. ఆ లైగర్ గోడవ ఎలా సాగుతోందంటే..

ఇక ఈ నష్టాలు ఇప్పటికీ వారిని వెంటాడుతూనే ఉన్నాయి.

By:  Tupaki Desk   |   10 Aug 2024 10:00 AM GMT
డబుల్ ఇస్మార్ట్.. ఆ లైగర్ గోడవ ఎలా సాగుతోందంటే..
X

డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మించిన ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్టు 15న విడుదల కానుంది. అయితే, ఈ చిత్రానికి నైజాం ఏరియాలో థియేటర్ల కష్టాలు ఎదురవుతున్నాయి. దీనికి కారణం పూరి, ఛార్మీల గత చిత్రం ‘లైగర్’తో వచ్చిన సమస్యలు. లైగర్ చిత్రం భారీ నష్టాలను చవిచూసిన సంగతి తెలిసిందే. ఇక ఈ నష్టాలు ఇప్పటికీ వారిని వెంటాడుతూనే ఉన్నాయి.

అప్పట్లో, వరంగల్ శ్రీను లైగర్ చిత్ర హక్కులను సొంతం చేసుకుని, ఎగ్జిబిటర్లు నుండి డబ్బు సేకరించారని టాక్ వచ్చింది. అయితే, తర్వాత వరంగల్ శ్రీను వ్యాపారం నుండి తప్పుకుని సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. నైజాంలో సునీల్ నారంగ్ మరియు ఉత్తరాంధ్రలో దిల్ రాజు వంటి ప్రముఖులు కూడా ఈ నష్టాల బారిన పడ్డారట.

పూరి, ఛార్మీ అయితే ఈ సమస్యకు సంబంధం లేదని, వారు లైగర్ హక్కులను వరంగల్ శ్రీను కు విక్రయించారనే మాట మీద నిలబడ్డారని కూడా కథనాలు వచ్చాయి. అంతేకాదు, ఇది రీఫండబుల్ అడ్వాన్స్ డీల్ కాదని, కాబట్టి ఎలాంటి న్యాయబద్ధమైన బాధ్యత లేదు అని చెప్పారని ఇండస్ట్రీలో మరొక టాక్ వచ్చింది. నైజాం ఎగ్జిబిటర్లు మాత్రం తమ డబ్బును చెల్లించినప్పుడు ఛార్మీ, ఏసియన్ సునీల్ కూడా చర్చల్లో ఉన్నారని, వారు బాధ్యత వహించాల్సి ఉంటుందని అంటున్నారు.

దీంతో మ్యాటర్ సాల్వ్ కాకుంటే ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను నైజాంలో బహిష్కరించబోతున్నామని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ లో పరిష్కారం కోసం దారితీసింది. వీలైనంత తొందరగా పరిష్కారం అందితే బెటర్ అనే మాట వినిపిస్తోంది. ఛాంబర్ నిబంధనల ప్రకారం, ఒక బిగ్ డిజాస్టర్ సినిమా విషయంలో, 20% నష్టపరిహారం కొనుగోలుదారులకు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఈ 20% ను హీరో, దర్శకుడు మరియు నిర్మాత మూడింటికి సమానంగా విభజిస్తారు. ఈ వ్యవహారంలో పూరి జగన్నాథ్ పూర్తి బాధ్యత తీసుకుంటారని తెలుస్తోంది. ఈ విషయంపై చర్చలు జరగగా, నష్టపరిహారం మొత్తానికి మరియు చెల్లింపు విధానానికి సంబంధించి తుది నిర్ణయం త్వరలో వెలువడనుంది.

ఇవ్వాల్సిన మొత్తాన్ని రెండు విడతల్లో ఇవ్వవచ్చని, ఒకటి సినిమా విడుదలకు ముందు మరొకటిని వచ్చే చిత్రంలో చెల్లించే అవకాశం ఉందని సమాచారం. మరి పూరి జగన్నాథ్ ఈ విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక రామ్ పోతినేని ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ సినిమా హిట్టవ్వడం అతనికి కూడా చాలా ముఖ్యం. వరుస ఫెయిల్యూర్స్ తో ఉన్న రామ్ మాస్ ఆడియెన్స్ లో మళ్ళీ తన రేంజ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు.