Begin typing your search above and press return to search.

నైజం అడ్డా.. ఈ ఏడాది అల్లకల్లోలమే..

దీనికి కారణం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ థియేటర్స్ లోకి వస్తూ ఉండటమే. వాటిలో ముందు వరుసలో కల్కి 2898 ఏడీ ఉంది.

By:  Tupaki Desk   |   2 April 2024 4:30 AM GMT
నైజం అడ్డా.. ఈ ఏడాది అల్లకల్లోలమే..
X

తెలుగు సినిమాలకి సీడెడ్, ఆంధ్రాలో కంటే నైజాంలో ఎక్కువ కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. అందుకే డిస్టిబ్యూటర్స్ ఎక్కువగా పెద్ద సినిమాలకి సంబందించిన నైజాం రైట్స్ కోసం పోటీ పడుతూ ఉంటారు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన ఆ సినిమాకి ఫస్ట్ బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ వచ్చేది నైజాం ఏరియాలోనే అని ట్రేడ్ పండితుల మాట. టికెట్ ధరల పరంగా కూడా ఆంధ్రా, తెలంగాణకి వ్యత్యాసం ఉంది. ఈ ఇంపాక్ట్ కలెక్షన్స్ లో కనిపిస్తూ ఉంటుంది. నైజాంలో మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ఆర్ఆర్ఆర్ సినిమా పేరు మీద ఉంది.

ఈ సినిమా ఏకంగా 23.35 కోట్లు ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో కలెక్ట్ చేసింది. దీని తర్వాత సలార్ సినిమాకి 22.55 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. థర్డ్ హైయెస్ట్ కలెక్షన్స్ మూవీగా 16.45కోట్ల గ్రాస్ తో గుంటూరు కారం ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డ్ ని నెక్స్ట్ వచ్చిన ఏ మూవీ కూడా ఇప్పటి వరకు బ్రేక్ చేయలేకపోయింది. అయితే ఈ ఏడాదిలో మాత్రం కచ్చితంగా నైజాంలో ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ కావడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.

దీనికి కారణం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ థియేటర్స్ లోకి వస్తూ ఉండటమే. వాటిలో ముందు వరుసలో కల్కి 2898 ఏడీ ఉంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఏ మాత్రం బజ్ క్రియేట్ చేసిన ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఫస్ట్ డే కలెక్షన్స్ ఉంటాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీ మోస్ట్ క్రేజియస్ట్ సినిమాగా హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్యలో రాబోతోంది.

ఈ సినిమా కూడా నైజాంలో ఆర్ఆర్ఆర్ పేరు మీద ఉన్న ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ని ఈజీగా బ్రేక్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. నైజాంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ హై రేంజ్ లో ఉంటుంది. అయన ఏవరేజ్ సినిమాకి కూడా నైజాంలో ఆడియన్స్ భారీ కలెక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు సుజిత్ దర్శకత్వంలో చేస్తోన్న పాన్ ఇండియా మూవీ ఓజీ హైఓల్టేజ్ కథాంశంతో రాబోతోంది. ఈ ఓజీ సునామీ ఏ రేంజ్ లో తీరాన్ని తాకుతుందో చూడటానికి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అరవింద సమేతతో ఐదేళ్ల క్రితం బ్లాక్ బస్టర్ బొమ్మ చూపించిన తారక్ ఈ సారి పవర్ ఫుల్ గా దేవరతో బాక్సాఫీస్ పై దాడి చేయబోతున్నాడు. ఈ సినిమాకి కూడా ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్ చేసే సత్తా ఉంది. అది ఏ స్థాయిలో ఉంటుందనేది చూడాలి. ఇక రామ్ చరణ్ గేమ్ చేంజర్ నైజాం డిస్టిబ్యూషన్ కింగ్ అయిన దిల్ రాజు స్వయంగా నిర్మిస్తోన్న నేపథ్యంలో రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ కోసం స్ట్రాంగ్ ప్లాన్ చేసుకుంటాడు. ఈ సినిమాలో నైజాంలో హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ఏ సినిమా పేరు మీదకి వెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నైజాంలో ఫస్ట్ డే టాప్ గ్రాస్ చిత్రాలివే

ఆర్ఆర్ఆర్ – 23.35 కోట్లు

సలార్ – 22.55 కోట్లు

గుంటూరు కారం – 16.45 కోట్లు

ఆదిపురుష్ – 13.68 కోట్లు

సర్కారువారిపాట – 12.24 కోట్లు

భీమ్లా నాయక్ – 11.85 కోట్లు

పుష్ప పార్ట్ 1 – 11.44 కోట్లు

రాధేశ్యామ్ – 10.80 కోట్లు