Begin typing your search above and press return to search.

నైజాం రికార్డులు.. మహేష్ ఈసారి ఎంత తెస్తాడో?

అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఆ రికార్డ్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని చెప్పాలి. ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే గుంటూరు కారం సినిమాకి భారీగానే జరుగుతున్నాయి

By:  Tupaki Desk   |   11 Jan 2024 4:29 AM GMT
నైజాం రికార్డులు.. మహేష్ ఈసారి ఎంత తెస్తాడో?
X

నైజాం ఏరియాలో తెలుగు సినిమాలకి ఎక్కువ కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. టికెట్ ధరలు మారిన తర్వాత ఆంధ్ర కంటే నైజాంలోనే మొదటి రోజు రికార్డ్ కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి. ఆంధ్రాలో థియేటర్స్ ఎక్కువ ఉన్న అక్కడ టికెట్ ధరలు నామమాత్రం పెంపు ఉంటుంది. ఈ కారణంగా నైజాంతో పోల్చుకుంటే ఆంధ్రాలో కలెక్షన్స్ ఈ మధ్యకాలంలో తగ్గుతున్నాయి.

దీంతో నిర్మాతలు, హీరోలు అందరూ కూడా నైజాం మార్కెట్ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి నైజాంలో మంచి పట్టుంది. ఆయన సినిమాలు మేగ్జిమమ్ నైజాంలో భారీ లాభాలు ఆర్జిస్తూ ఉంటాయి. అయితే మొదటి రోజు నైజాం ఏరియాలో హైయెస్ట్ కలెక్షన్స్ సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారువారిపాట సినిమాతో మూడో స్థానంలోఉన్నారు .

ఆర్ఆర్ఆర్ సినిమానే ఇప్పటికే వరకు ఫస్ట్ డే హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న మూవీగా నిలిచింది. దీని తర్వాత సలార్ మొదటి రోజు ఏకంగా 22.55 కోట్ల షేర్ ని సొంతం చేసుకొని రెండో స్థానంలో నిలిచింది. ప్రభాస్ ఆదిపురుష్ మూవీ 13.68 కోట్ల షేర్ అందుకొని మూడో స్థానంలో ఉంది. ఓ విధంగా చెప్పాలంటే నైజాంలో ఎక్కువ సార్లు ఫస్ట్ డే టాప్ షేర్ అందుకున్న హీరోగా ప్రభాస్ ఇప్పటి వరకు ఉన్నాడు.

అతని ప్రతి సినిమా కూడా నైజాంలో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నాయి. అయితే ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఆ రికార్డ్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని చెప్పాలి. ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే గుంటూరు కారం సినిమాకి భారీగానే జరుగుతున్నాయి. అయితే నైజాంలో ఆర్ఆర్ఆర్ పేరు మీద ఉన్న రికార్డ్ ని గుంటూరుకారం బ్రేక్ చేయగలదా అనేది ఆసక్తికరంగా మారింది.

మొదటి రోజు 24 నుంచి 25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగితే ఆర్ఆర్ఆర్ రికార్డ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రేక్ చేసినట్లు అవుతుంది. అయితే అది అంత ఈజీ కాదు. కానీ ఈ మూవీ రిలీజ్ అయిన థియేటర్స్ నెంబర్ ఆధారంగా చూసుకుంటే సాధ్యమయ్యేలానే ఉంది.