Begin typing your search above and press return to search.

NKR21 క‌థా నేప‌థ్యం అదేనా?

యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం క‌ళ్యాణ్ రామ్ చాలా క‌ష్ట‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   8 March 2025 11:47 AM IST
NKR21 క‌థా నేప‌థ్యం అదేనా?
X

ఈ మ‌ధ్య నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కంటెంట్ ఉన్న సినిమాల‌ను ఎంచుకోవ‌డంపై దృష్టి పెడుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో మాస్, యాక్ష‌న్ సినిమాల వైపు మొగ్గు చూపిన ఆయ‌న గ‌త కొంతకాలంగా కంటెంట్ బేస్డ్ సినిమాలపై ఫోక‌స్ చేస్తూ భిన్న సినిమాల‌ను చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే బింబిసార‌, అమిగోస్, డెవిల్ లాంటి సినిమాలు చేశాడు.

వాటిలో బింబిసార బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ‌గా, డెవిల్ ఫ‌ర్వాలేద‌నిపించింది. అమిగోస్ మాత్రం ఫ్లాప్ అయింది కానీ క‌ళ్యాణ్ రామ్ కొత్త‌గా ట్రై చేశాడ‌నే పేరైతే వ‌చ్చింది. డెవిల్ త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ ప్ర‌స్తుతం ప్ర‌దీప్ చిలుకూరి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 21వ సినిమాను చేస్తున్న విష‌యం తెలిసిందే. NKR21 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ రూపొందుతుంది.

యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం క‌ళ్యాణ్ రామ్ చాలా క‌ష్ట‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ మూవీలో క‌ళ్యాణ్ రామ్ పాత్రను చాలా ప‌వ‌ర్‌ఫుల్ గా డిజైన్ చేశాడ‌ట డైరెక్ట‌ర్ ప్ర‌దీప్. ఈ సినిమాలో లేడీ సూప‌ర్ స్టార్ విజ‌యశాంతి కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ చిన్న గ్లింప్స్ ద్వారా తెలిప‌గా ఆ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ కూడా వ‌చ్చింది.

ఇదిలా ఉంటే NKR21 కు సంబంధించిన టైటిల్ ను మార్చి 8న ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్ల‌డించింది. అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి అనే టైటిల్ ను ఈ సినిమాకు టైటిల్ గా ఫిక్స్ చేశార‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వర్గాల స‌మాచారం. విజ‌య‌శాంతి పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీల‌కమ‌ని టైటిల్ ను బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది.

విజ‌య‌శాంతి కొడుకు పాత్ర‌లో క‌ళ్యాణ్ రామ్ క‌నిపిస్తాడ‌ని, తల్లికి ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను కొడుకు ఏ విధంగా ప‌రిష్క‌రిస్తాడ‌నే నేప‌థ్యంలోనే క‌థ సాగుతుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో ఏ మేర‌కు నిజ‌ముందనేది తెలియాల్సి ఉంది. స‌యూ మంజ్రేక‌ర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాలో సోహైల్ ఖాన్ విల‌న్ గా న‌టిస్తున్నాడు.