Begin typing your search above and press return to search.

NKR21: 8 కోట్లు.. వెయ్యి మంది!

నందమూరి కళ్యాణ్ రామ్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా భారీ సినిమాలతో తన మార్కెట్ ను పెంచుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   30 July 2024 7:13 AM GMT
NKR21: 8 కోట్లు.. వెయ్యి మంది!
X

నందమూరి కళ్యాణ్ రామ్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా భారీ సినిమాలతో తన మార్కెట్ ను పెంచుకుంటున్నారు. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఒక డిఫరెంట్ పాయింట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ హీరో అన్ని వర్గాల ఆడియెన్స్ ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో బిగ్ మూవీని సిద్ధం చేస్తున్నారు. NKR21 చిత్రం ఇటీవల క్లైమాక్స్ సన్నివేశాలను పూర్తి చేసుకుంది.

ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్ నగర శివార్లలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్స్ పై ఈ క్లైమాక్స్ కోసం ముప్పై రోజులు పాటు చిత్రీకరణ జరిపారు. ఈ కీలక సన్నివేశం కోసం నిర్మాతలు ఏకంగా రూ. 8 కోట్లను వెచ్చించారు. ఇది కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధికంగా ఖర్చు చేసిన కాస్ట్లీ ఎపిసోడ్ కావడం విశేషం. క్లైమాక్స్ సన్నివేశానికి అవసరమైన గ్రాండియర్ సెట్ డిజైన్ కోసం ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి పని చేశారు.

ఈ సెట్స్ చాలా అద్భుతంగా, విజువల్ గా ఆకట్టుకునేలా రూపొందించారు. యాక్షన్ సన్నివేశాలకు రామకృష్ణ ఆధ్వర్యంలో అద్భుతమైన ఫైట్ కొరియోగ్రఫీ చేయబడింది. క్లైమాక్స్ లో ప్రధాన తారాగణంతో పాటు సుమారు 1000 మంది ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ చిత్రానికి ఎంతో ముఖ్యమైనదిగా మారింది. ఈ భారీ క్లైమాక్స్ సన్నివేశం మొత్తం కథకు కీలకమని, అంతే కాకుండా దీనికి వెచ్చించిన మొత్తాన్ని చూస్తే నిర్మాతలు ఎంత మునుపెన్నడూ ఇలా చేసి ఉండడని స్పష్టం అవుతోంది.

సినిమాలో సీనియర్ స్టార్ నటీమణి విజయశాంతి ఒక కీలక పాత్రలో, ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఆమె పవర్ ఫుల్ ప్రెజెన్స్ తో ఈ చిత్రానికి మరింత బూస్ట్ అందించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ కూడా అంచనాల స్థాయిని పెంచేసింది. ఇక సోహైల్ ఖాన్, సాయీ మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

అశోక వర్ధన్ ముప్పా మరియు సునీల్ బాలుసు నిర్మాణంలో అశోక క్రియేషన్స్ మరియు ఎన్‌టిఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై ఈ చిత్రం రూపొందుతోంది. ముప్పా వెంకయ్య చౌదరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను రామ్ ప్రసాద్ చేపడుతున్నారు. ఆయన ప్రతి సన్నివేశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా, మెరుపు లాంటి విజువల్స్ తో చిత్రీకరించారు.

కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి మరింత ఉత్సాహం తెస్తోంది. ఎడిటర్ థమ్మిరాజు, స్క్రీన్ ప్లే రైటర్ శ్రీకాంత్ విశ్సా ఈ చిత్రానికి అత్యద్భుతమైన కథను అందించారు. ఇటీవల పూర్తి చేసిన క్లైమాక్స్ సన్నివేశం చూసినవారు సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారు. దాదాపు వందల మంది టెక్నీషియన్స్, కాస్టింగ్ తో రూపొందిన ఈ సన్నివేశం ప్రేక్షకులను థియేటర్ లో పీక్స్ ఎమోషన్ కి చేర్చడంలో ముందుండటం ఖాయమని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేసింది.