Begin typing your search above and press return to search.

ఇకపై నో బెనిఫిట్ షోస్.. గేమ్ ఛేంజర్ పరిస్థితేంటి?

ఇది కొన్నాళ్లుగా జరుగుతోంది. కానీ ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోస్ ఉండవు. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది.

By:  Tupaki Desk   |   21 Dec 2024 11:23 AM GMT
ఇకపై నో బెనిఫిట్ షోస్.. గేమ్ ఛేంజర్ పరిస్థితేంటి?
X

బడా హీరోల సినిమాలకు మేకర్స్ బెనిఫిట్స్ షోస్ వేయడం.. తెలిసిన విషయమే. అందుకు గాను ముందు మేకర్స్.. ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుంటారు. ఆ తర్వాత స్పెషల్ షోస్ ఏర్పాటు చేస్తారు. ఇది కొన్నాళ్లుగా జరుగుతోంది. కానీ ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోస్ ఉండవు. ఈ మేరకు రాష్ట్ర సర్కార్ ప్రకటించింది.

తెలంగాణలో ఇకపై బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వబోమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీలో శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు. టికెట్ల రేట్లను పెంచేందుకు కూడా అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబాన్ని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని వెల్లడించారు.

అంతకుముందు.. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలంతా సినిమాలు తీసుకోండని, బిజినెస్ చేసుకోండని అన్నారు. ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా తీసుకోండని తెలిపారు. షూటింగ్లకు ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండని అన్నారు. కానీ ప్రజల ప్రాణాలు పోతుంటే తమ ప్రభుత్వం మాత్రం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే మాత్రం ఇకపై ప్రత్యేక మినహాయింపులు ఉండవని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. రాష్ట్రంలో ఎలాంటి బెనిఫిట్‌ షోలు, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతివ్వబోమని తేల్చి చెప్పేశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అప్ కమింగ్ బడా చిత్రాల పరిస్థితేంటని అంతా మాట్లాడుకుంటున్నారు.

ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ త్వరలో విడుదల కానుంది. కోలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దిల్ రాజు రూపొందించిన ఆ సినిమా జనవరి 10వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తూ ఆడియన్స్ లో మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

రీసెంట్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప-2 సినిమాకు అందినట్లే తెలంగాణలో అన్ని అనుమతులు గేమ్ ఛేంజర్ కు దక్కుతాయని అంతా అంచనా వేశారు. స్పెషల్ షోస్ పడతాయని కూడా ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు మంత్రి ప్రకటనతో ఏం జరగనుందోనని డిస్కస్ చేసుకుంటున్నారు. మరి గేమ్ ఛేంజర్ విషయంలో ఏమవుతుందో తెలియాలంటే వేచి చూడాలి.