గేమ్‌ఛేంజర్ : ఇలాగైతే పరువు పోవడం ఖాయం
యూఎస్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. అయినా ఇప్పటికీ అక్కడ బజ్ క్రియేట్ కాలేదు. అక్కడ అడ్వాన్స్ బుకింగ్ మినిమం కావడం లేదు.
By: Tupaki Desk | 17 Dec 2024 2:15 AM GMTరామ్ చరణ్ డ్యూయెల్ రోల్‌లో శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. రెండుగా విడిపోయిన మెగా ఫ్యాన్స్ ఇటీవల పుష్ప 2 ను నెత్తిన పెట్టుకుని ప్రమోట్ చేశారు. దానికి తగ్గట్లుగా ఇప్పటికే సినిమా రూ.1400 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. గేమ్ ఛేంజర్ పరువు నిలుపుకోవాలి అంటే కనీసం రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఆ స్థాయిలో గేమ్ ఛేంజర్ సినిమా వసూళ్లు రాబట్టే విధంగా ప్రమోషన్స్ జరగడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి.
సంక్రాంతికి రాబోతున్న గేమ్ ఛేంజర్‌కి మీడియం రేంజ్ సినిమాలే అయినా డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు గట్టి పోటీని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ రెండు సినిమాలపై గేమ్ ఛేంజర్ పూర్తి ఆధిపత్యం కనబర్చడం ఖాయం అనుకుంటూ మెగా ఫ్యాన్స్ ధీమాతో ఉంటే ఇప్పటి వరకు దిల్‌రాజు కాంపౌండ్ సాలిడ్ ప్రమోషన్స్‌ను చేపట్టిన దాఖలాలు లేవు. అందుకే సినిమా విడుదల సమయంకు అయినా బజ్ క్రియేట్ అయ్యేనా, వసూళ్ల విషయంలో పరువు నిలిచేనా అంటూ మెగా ఫ్యాన్స ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప 2 సినిమా జోరుగా వసూళ్లు రాబట్టడంకు కారణం భారీ ఎత్తున ఓపెనింగ్స్ రావడం అనే విషయం తెల్సిందే. ఇండియన్ సినీ చరిత్రలో గతంలో ఏ సినిమాకు రాని ఓపెనింగ్ వసూళ్లు పుష్ప 2 కి వచ్చాయి. అందుకే లాంగ్‌రన్‌లోనూ సినిమాకు భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతున్నాయి. అందుకే ఈ సినిమాకు భారీ ఎత్తున పబ్లిసిటీ చేయడం ద్వారా మాత్రమే రికార్డ్ స్థాయి ఓపెనింగ్ వసూళ్లు సొంతం చేసుకోగలదు. కానీ ఇప్పటి వరకు బజ్ క్రియేట్ చేయడంలో దిల్ రాజు అండ్ టీం విఫలం అయ్యారు. యూఎస్‌లో ఈ సినిమా ప్రీ సేల్ ప్రారంభించినా పెద్దగా పట్టించుకోవడం లేదు.
యూఎస్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. అయినా ఇప్పటికీ అక్కడ బజ్ క్రియేట్ కాలేదు. అక్కడ అడ్వాన్స్ బుకింగ్ మినిమం కావడం లేదు. దాంతో అసలు ఏం జరుగుతుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నార్త్ ఇండియాలో గేమ్ ఛేంజర్ లాంగ్ రన్‌లో కనీసం రూ.50 కోట్ల వసూళ్లు సాధిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరీ ఇంత దారుణంగా బజ్ ఉంటే పరువు పోవడం ఖాయం అనే అభిప్రాయాన్ని మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఎలా ఉన్నా భారీ పబ్లిసిటీ చేస్తే మినిమం వసూళ్లు వచ్చి పరువు నిలుస్తుంది అనేది వారి అభిప్రాయం. గేమ్ ఛేంజర్ సినిమా చరణ్‌కే కాకుండా మెగా ఫ్యాన్స్‌కి కీలకంగా మారింది.