Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 9 : ఈసారి వాళ్లకి ఛాన్స్ లేదట..!

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. ఈసారి సీజన్ 9 ని వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 March 2025 5:00 AM IST
బిగ్ బాస్ 9 : ఈసారి వాళ్లకి ఛాన్స్ లేదట..!
X

బిగ్ బాస్ సీజన్ 9 త్వరలో మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. ఈసారి సీజన్ 9 ని వీలైనంత త్వరగా మొదలు పెట్టాలని చూస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 ని జూలైలో మొదలు పెట్టే ఛాన్స్ లు ఉన్నట్టు తెలుస్తుంది. ఐతే హోస్ట్ గా నాగార్జున కొనసాగుతారా లేదా మరో హోస్ట్ వస్తారా అన్నది త్వరలో తెలుస్తుంది. ప్రతి సీజన్ మొదలయ్యే ముందు హోస్ట్ గా నాగార్జున ప్లేస్ లో ఎవరెవరినో ప్రస్తావిస్తూ కథనాలు రావడం సహజమే. ఐతే ఈ సీజన్ కి డైరెక్ట్ గా విజయ్ దేవరకొండ హోస్ట్ గా చేస్తాడని చెప్పేస్తున్నారు. ఐతే ఆ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 9 లో నో కామన్ మ్యాన్ అని టాక్. అంటే కామన్ మ్యాన్ గా వచ్చి హౌస్ మెట్స్ తో పాటు ఆడియన్స్ మనసులు గెలిచి టైటిల్ విజేతగా మారే ఛాన్స్ లేదని తెలుస్తుంది. అలా ఎందుకు అంటే కామన్ మ్యాన్ ని తీసుకోవడం వల్ల సెలబ్రిటీస్ కి తక్కువ ఓటింగ్ వస్తుందని భావిస్తున్నారట. ముఖ్యంగా కామన్ మ్యాన్ అనేసరికి ఆడియన్స్ లో సింపతీ వర్క్ అవుట్ అవుతుంది. అతను ఆట ఆడినా ఆడకపోయినా 10 వారాల దాక సేఫ్ చేస్తున్నారని బిగ్ బాస్ టీం ఫిక్స్ అయ్యారు.

అందుకే ఈ సీజన్ లో వరకు కామన్ మ్యాన్ లేకుండానే షో మొదలు పెడతారని టాక్. అంతేకాదు ఈసారి సెలబ్రిటీస్ విషయంలో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 లో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కంటెస్టెంట్స్ గా వస్తారని టాక్. అదే జరిగితే మాత్రం కచ్చితంగా బిగ్ బాస్ ఆడియన్స్ కి పండగే అని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 9 విషయంలో మేకర్స్ చాలా పెద్ద ప్లానింగ్ తో వస్తున్నారని తెలుస్తుంది.

ఈసారి టాస్క్ లు కూడా చాలా కొత్తగా ఉంటాయని చెబుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 9 లో చాలా సర్ ప్రైజ్ లు ఉండబోతాయని టాక్. కంటెస్టెంట్స్ నుంచి టాస్కులతో పాటు సీజన్ 9 మునుపటి సక్సెస్ ఫుల్ సీజన్లను గుర్తు చేసేలా ప్లాన్ చేస్తున్నారట బిగ్ బాస్ టీం. అంతేకాదు ఈ సీజన్ నుంచి ముందుగా ఎలాంటి లీక్స్ కూడా రాకుండా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి టీం ప్లానింగ్ ఇలా ఉంటే ఈ సీజన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.