Begin typing your search above and press return to search.

బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కి రెండు ద‌శాబ్దాల త‌ర్వాత సీక్వెల్!

రెండు ద‌శాబ్దాల క్రితం రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం `నో ఎంట్రీ` అప్ప‌ట్లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Feb 2025 2:45 AM GMT
బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కి రెండు ద‌శాబ్దాల త‌ర్వాత సీక్వెల్!
X

రెండు ద‌శాబ్దాల క్రితం రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం `నో ఎంట్రీ` అప్ప‌ట్లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. అనీల్ క‌పూర్, స‌ల్మాన్ ఖాన్, ఫ‌ర్దీన్ ఖాన్, బిపాసా బ‌సు, లారా ద‌త్తా, సెలీనా జైట్లీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో అనీస్ బ‌జ్మీ తెర‌కెక్కించిన ఈ కామెడీ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. 20 కోట్ల బ‌డ్జెట్ లో నిర్మించిన చిత్రం 70 కోట్ల‌కు పైగా రాబ‌ట్టింది. దీంతో ఆ సినిమాకి సీక్వెల్ తీస్తే బాగుంటుంద‌ని చాలా కాలంగా అభిమానులు కోరుతున్నా? అనీస్ ఆ ఛాన్స్ తీసుకోలేదు.

వేర్వేరు ప్రాజెక్ట్ లు...వాటికి సీక్వెల్స్ చేసాడు గానీ `నో ఎంట్రీ-2`ని మాత్రం షురూ చేయ‌లేదు. అయితే ఇప్పుడంద‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఒక్క‌సారిగా `నో ఎంట్రీ -2` ప్ర‌క‌ట‌న‌లో అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేసారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి గ్రీస్ లో లొకేష‌న్ల వేట కూడా మొద‌లు పెట్టారు. ఈ సినిమా రైట్స్ ఇప్ప‌టికీ బోనీ క‌పూర్ వ‌ద్ద‌నే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో `నోఎంట్రీ -2` కూడా ఆయ‌నే నిర్మించ‌డానికి ముందుకొచ్చారు.

దీనిలో భాగంగా అనీల్ క‌పూర్, అనీస్ బ‌జ్మీ, సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ను ఆనంద్ గ్రీస్ లో లొకేష‌న్ల హంటింగ్ లో ఉన్నారు. అక్క‌డ నుంచి ఓఫోటోను పోస్ట్ చేసి విష‌యాన్ని రివీల్ చేసారు. `నో ఎంట్రీ 2` కి సిద్దంగా ఉండండి అంటూ అనీస్ క్యాప్ష‌న్ ఇచ్చారు. ఈ సినిమాని బిగ్ స్కేల్ లోనే ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. రిచ్ అండ్ ఎగ్జోటిక్ లోకేష‌న్ల‌లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగానికి మించి రెండ‌వ భాగంతో మ‌రింత న‌వ్వులు పూయించిలే స్క్రిప్ట్ సిద్దం అయిన‌ట్లు తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్ స‌హా అన్ని ప‌నులు పూర్తి చేసి వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ జోరుగా న‌డుస్తోంది. ఇప్ప‌టికే చాలా సీక్వెల్స్ ఆన్ సెట్స్ లో ఉన్నాయి. రెండు ద‌శాబ్ధాల క్రితం నాటి క‌థ‌లకు ఎక్కువ‌గా సీక్వెల్స్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో నోంట్రీ -2 కూడా తెర‌పైకి రావ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌దుల్లేవ్.