Begin typing your search above and press return to search.

GOAT.. ఇలా అయితే తేడా కొట్టినట్లే..

ఇళయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన GOAT మూవీ సెప్టెంబర్ 5న పాన్ ఇండియా రేంజ్ లో థియేటర్స్ లో రాబోతోంది.

By:  Tupaki Desk   |   30 Aug 2024 9:30 PM GMT
GOAT.. ఇలా అయితే తేడా కొట్టినట్లే..
X

ఇళయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన GOAT మూవీ సెప్టెంబర్ 5న పాన్ ఇండియా రేంజ్ లో థియేటర్స్ లో రాబోతోంది. నాలుగు భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. దళపతి విజయ్ ఇమేజ్ తోనే ఈ సినిమాకి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ బాగానే చేస్తోన్న కూడా సినిమాపై పెద్దగా సౌండ్ క్రియేట్ అవ్వలేదు. ట్రైలర్ మాత్రం బాగుందనే టాక్ వచ్చింది.

లియో సినిమాకి ఉన్నంత హైప్, క్రేజ్ అయితే GOAT సినిమాపై లేదని చెప్పొచ్చు. దీనికి దర్శకుడిగా వెంకట్ ప్రభు ట్రాక్ రికార్డ్ కూడా ఒక కారణం అనే మాట వినిపిస్తోంది. విభిన్న కథలతో సినిమాలు చేసే వెంకట్ ప్రభుకి సక్సెస్ లతో పాటు దారుణమైన ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. వెంకట్ ప్రభు చివరిగా నాగ చైతన్యతో కస్టడీ అనే మూవీ తెలుగు, తమిళ్ భాషలలో తీసాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీని తర్వాత GOAT మూవీ వస్తోంది.

వెంకట్ ప్రభు కథలు చెప్పే విధానం కాస్తా డిఫరెంట్ గా ఉంటుంది. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కూడా వెంకట్ ప్రభు తన సినిమాలలో ఉపయోగిస్తూ ఉంటాడు. GOAT చిత్రాన్ని యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో చేశాడు. ఈ చిత్రంలో విజయ్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. స్పై థ్రిల్లర్ గా మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకట్ ప్రభు సినిమాకి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

మూవీలో యాక్షన్ ఎలిమెంట్స్, కథాంశం అజిత్ మనకథ తరహాలో ఉంటుందని అన్నారు. అలాగే సినిమాలో కామెడీ కూడా ఉంటుందని, శంకర్ శివాజీ చిత్రంలో తరహాలో మంచి కామెడీ సీక్వెన్స్ ఉన్నాయని చెప్పారు. అయితే ఈ సినిమా కంటెంట్ కి హైప్ తీసుకొచ్చే ప్రయత్నంలో వేరొక సినిమాలతో కంపారిజన్ చేసి చెప్పడం కరెక్ట్ గా లేదనే మాట వినిపిస్తోంది. ఒకసారి కంపారిజన్ చేస్తే ప్రేక్షకులు GOAT సినిమాని ఆ మూవీస్ తో పోల్చుకొని చూస్తారు.

అప్పుడు కంటెంట్ వాటికి దరిదాపుల్లో లేకపోతే తేడా కొట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకే సినిమాపై హైప్ తీసుకురావడానికి ఇతర సినిమాలతో పోలిక చేసి చెప్పడం కరెక్ట్ కాదనే మాట వినిపిస్తోంది. సినిమా కంటెంట్ ని బలంగా జనాల్లోకి తీసుకెళ్తే ఆటోమేటిక్ గా హైప్ వస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.