Begin typing your search above and press return to search.

టాలీవుడ్.. చిన్న మూవీస్ తో ఓ రేంజ్ లో..

పాన్ ఇండియా లెవెల్ లో ఎంత భారీగా సినిమా తీసినా.. కంటెంట్ ముఖ్యం బిగిలూ అన్న విధంగా ఉంటున్నారు.

By:  Tupaki Desk   |   22 Oct 2024 2:57 AM GMT
టాలీవుడ్.. చిన్న మూవీస్ తో ఓ రేంజ్ లో..
X

సినిమాను ఆదరించే విషయంలో ఆడియన్స్ దృష్టి పూర్తిగా మారిపోయిందన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తీసినా.. స్టార్ క్యాస్టింగ్ దింపినా.. ఫుల్ గా గ్రాఫిక్స్, వీఎఫ్ ఎక్స్ యాడ్ చేసినా.. కంటెంట్ కే పెద్ద పీట వేస్తున్నారు. కంటెంట్ బాగుంటే చాలు.. సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఎంత భారీగా సినిమా తీసినా.. కంటెంట్ ముఖ్యం బిగిలూ అన్న విధంగా ఉంటున్నారు.

దీంతో మంచి కంటెంట్ తో తెరకెక్కే పాన్ ఇండియా చిత్రాలు.. సూపర్ హిట్ అవుతున్నాయి. అదే సమయంలో చిన్న సినిమాలు కూడా అదరగొడుతున్నాయి. మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. అందుకే టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు.. అటు భారీ బడ్జెట్ తో చిత్రాలు రూపొందిస్తున్నాయి. ఇటు చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. దీంతో కొన్నాళ్లుగా చిన్న సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూ కొన్నేళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్న దిల్ రాజు.. చిన్న సినిమాలను రూపొందించేందుకు తన పేరుతో మరో నిర్మాణ సంస్థను స్టార్ట్ చేశారు. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై ఇప్పటికే బలగం, లవ్లీ చిత్రాలను నిర్మించారు. మరిన్ని సినిమాలను తీసేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీమంతుడు మూవీతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి సత్తా చాటుతున్న మైత్రీ మూవీ మేకర్స్ కూడా చిన్న సినిమాలపై ఫోకస్ చేసింది.

రీసెంట్ గా మత్తు వదలరా -2 మూవీని తీసుకొచ్చి మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం కంటెంట్ బేస్డ్ మూవీ 8 వసంతాలు రూపొందిస్తోంది. మరిన్ని సినిమాలను లైన్ లో పెట్టింది. మరోవైపు వేరే లెవెల్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కూడా చిన్న చిత్రాలతో మంచి హిట్లు అందుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం గౌతమ్ తిన్నూనూరి డైరెక్షన్ లో మ్యాజిక్ మూవీ చేస్తోంది. మ్యాడ్ -2ను త్వరలో స్టార్ట్ చేయనుంది.

టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ కూడా కొన్నేళ్లుగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై చిన్న చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆయ్ తో మంచి హిట్ అందుకుంది. మరిన్ని సినిమాలను కూడా నిర్మిస్తోంది. భారీ సినిమాలు తీసే యూవీ క్రియేషన్స్ కూడా వి సెల్యూలాయిడ్స్ పేరుతో అనుబంధ బ్యానర్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే చిన్న చిత్రం ఓం భీమ్ బుష్ తో మంచి హిట్ అందుకున్న ఆ సంస్థ.. కంటెంట్ డ్రివెన్ సినిమాలపై దృష్టి పెట్టింది. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గామితో పాటు సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో వంటి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తోంది. మరి ఈ నిర్మాణ సంస్థలన్నీ ఎలాంటి హిట్స్ అందుకుంటాయో చూడాలి.