టాలీవుడ్ ని బాలీవుడ్ ప్రశంసించదా?
ఓ తెలుగు హీరో హిందీ మార్కెట్ లో ఇలాంటి సంచలనం నమోదు చేయడంతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదే మొట్ట మొదటి సారి.
By: Tupaki Desk | 27 Dec 2024 5:30 PM GMT`పుష్ప-2`తో ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇప్పటికే 700 కోట్లకు పైగా వసూళ్లను ఒక్క నార్త్ బెల్ట్ లోనే సాధించి బాలీవుడ్ నే శాషించిన చిత్రంగా రికార్డు నమోదు చేసింది. ఓ తెలుగు హీరో హిందీ మార్కెట్ లో ఇలాంటి సంచలనం నమోదు చేయడంతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదే మొట్ట మొదటి సారి. బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ హీరోలందర్నీ పక్కకు నెట్టేసి ఓ కొత్త చరిత్ర రాసాడు ఐకాన్ స్టార్.
ఇప్పటికే 1700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. `బాహుబలి 2` వసూళ్లను బీట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావి స్తున్నాయి. అలాగే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 2000 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందని అంచనాలున్నాయి. అదే జరిగితే ఆమిర్ ఖాన్ `దంగల్` రికార్డు తిరగరాసినట్లే అవుతుంది. ఇన్ని సంచలనాలు నమోదు చేస్తున్నా బాలీవుడ్ నుంచి అనుకున్న స్థాయిలో ప్రశంసలు మాత్రం రావడం లేదు. సినిమాని , వసూళ్లను ఉద్దేశించి పెద్దగా ఎవరూ స్పందించడం లేదు.
ఆ మధ్య యశ్ రాజ్ ఫిలింస్ నుంచి ఓ ప్రశంసా ట్వీట్ వచ్చింది తప్ప మిగతా ఏ అగ్ర నిర్మాణ సంస్థల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇక హీరోల్లో అమితాబచ్చన్ మాత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనను ఉద్దేశించి రెండు సందర్బాల్లో ప్రశంసలు కురిపించారు. మిగతా హీరోలెవరూ కూడా సినిమా గురించి ఏ సందర్భంలోనూ మాట్లాండింది లేదు. మరి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటంతోనే సాధ్యపడలేదా లేక తెలుగు సినిమా బాలీవుడ్ ని శాషించే సరికి మూగబోయారా? అన్నది అర్దం కాని సన్నివేశంగా మారింది.
అక్కడ స్టార్ హీరోలు అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఇలా ఎంతో మంది స్టార్లు ఉన్నారు. షారుక్ ఖాన్ మాత్రం తమిళ సినిమాలు సక్సెస్ అయితే టీమ్ ని ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తుంటారు. కానీ ఆ సన్నివేశం ఇంత వరకూ ఏ తెలుగు సినిమా విషయంలో చోటు చేసుకోలేదు. దీంతో `పుష్ప-2` విజయాన్ని అక్కడ హీరోలు స్పోర్టివ్ గా తీసుకున్నట్లు కనిపించలేదంటున్నారు నెటి జనులు. అలా తీసుకోకపోయినా పర్వాలేదు స్పూర్తిగా తీసుకుని `పుష్ప-2` రికార్డులను హీరోలు చేధించాలని నెటి జనులు ఆశిస్తున్నారు.