టాలీవుడ్ లో ఎవరూ బయోపిక్ లు రాయడం లేదే!
కానీ వాళ్లను మెప్పించేలా రాయగల్గితే ఎందుకు అంగీకరించరు? అన్నది మరికొంత మంది వాదన.
By: Tupaki Desk | 6 Oct 2023 2:30 PM GMTబాలీవుడ్ తో పొలిస్తే మిగతా పరిశ్రమల్లో బయోపిక్ లు అనేవి చాలా అరుదు. వాస్తవ సంఘటనలు ఆధారంగా సినిమాలు తీస్తున్నారు తప్ప! జీవిత కథల జోలికి మాత్రం సౌత్ మేకర్స్ ఎవరూ వెళ్లడం లేదు. అందులోనూ టాలీవుడ్ లో అస్సలు సాహసిస్తున్నట్లు కనిపించలేదు. అప్పట్లో నటసౌర్వబౌమ ఎన్టీఆర్ జీవిత కథని రెండు భాగాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
కానీ ఆ సినిమా అంచనాలు అందుకోలేదు. ఎన్టీఆర్ కథని చెప్పడంలో తప్పిదార్లు దొర్లడంతో ఆ సినిమా అంత ఫీల్ తీసుకురాలేదు. ఆ తర్వాత దర్శకరత్న దాసరి నారాయణరావు బయోపిక్ కూడా చేస్తున్నట్లు ప్రచారం సాగింది. ఆయన మరణానంతరం ఆయన శిష్యులు ఆ బాధ్యతలు తీసుకుంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పుడా ప్రాజెక్ట్ కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. అయితే దాసరి కథ నిజంగా రాయడం అన్నది మొదలైందా? లేదా? అన్నది సందేహమే.
ఎందుకంటే కథ రాస్తున్నట్లు...తీస్తున్నట్లు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కేవలం సోషల్ మీడియాలో ప్రచారం తప్ప. అలాగే మరో లెజెండ్ మూవీ మోఘల్ డి. రామానాయుడు జీవితాన్ని కూడా వెండి తెరకెక్కిస్తే బాగుంటుందని ఇండస్ట్రీలో వినిపించింది. అందులో వెంకటేష నటిస్తేనే ఆయన కథకి సార్దకత దక్కుతుందని చాలా మంది భావించారు. కానీ ఇప్పుడా వార్త వినిపించలేదు. దీంతో ఇది కూడా గాలి వార్తనేని తెలిపోయింది. అలాగే లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జీవిత కథని తెరకెక్కిస్తే బాగుంటుందని మరణానంతరం ప్రచారం సాగింది.
కానీ దీనిపై కూడా తదుపరి రోజుల్లో ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో తెలుగు రచయితలు అసలు ఆవిధమైన సాహసం కూడా చేస్తున్నట్లు కనిపించలేదు. కథ రాసి మెప్పించ గల్గితే నటించడానికి ఎవరో ఒకరు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. కానీ తెలుగు దర్శక-రచయితలు ఆ ఛాయిస్ తీసుకోవడం లేదు.
ఇక్కడ మరో ఆసక్తికర సంగతి కూడా ఉంది. కథ రాయలన్నా! ముందుగా ఆ కుటుంబాల అనుమతులు తీసుకోవాలి. వాళ్లు అంగీకరిస్తారా? లేదా? అన్నద కూడా ఓసందేహమే. కానీ వాళ్లను మెప్పించేలా రాయగల్గితే ఎందుకు అంగీకరించరు? అన్నది మరికొంత మంది వాదన. కారణాలు ఏవైనా టాలీవుడ్ లో ఏఎన్నార్..రామానాయుడు..దాసరి లాంటి దిగ్గజాల జీవితాల్ని తెరపై చూడాలని ప్రేక్షకాభిమానలు మాత్రం ఆశిస్తున్నారు.