Begin typing your search above and press return to search.

అయ్యో స్టార్ సినిమా లెక్కలో వేయరేంటి..?

ఐతే రజిని వేటయ్యన్ సినిమాను తెలుగులో అస్సలు ఎవరు పట్టించుకోవట్లేదు. సినిమాకు తెలుగు బిజినెస్ డీల్ ఇంకా పూర్తి కాలేదని టాక్.

By:  Tupaki Desk   |   27 July 2024 10:30 AM GMT
అయ్యో స్టార్ సినిమా లెక్కలో వేయరేంటి..?
X

జైలర్ సినిమాతో సూపర్ స్టార్ రజిని తిరిగి సూపర్ ఫాం లోకి వచ్చారు. కొన్నాళ్లుగా బాక్సాఫీస్ దగ్గర తన మార్క్ చాటని రజిని జైలర్ తో ఆ ఆకలి తీర్చేశాడు. జైలర్ సినిమా తర్వాత మళ్లీ రజిని కెరీర్ లో దూకుడు మొదలు పెట్టాడు. ఒక సినిమా పూర్తి కాకుండానే మరో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం రజిని టీ జే జానవేల్ డైరెక్షన్ లో వేటయ్యన్ సినిమా చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తుంది. ఈ సినిమాలో మంజు వారియర్, రితిక సింగ్ లు నటిస్తున్నారు. సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా కూడా భాగం అవుతున్నారు.

కల్కి సినిమాలో అమితాబ్ చేసిన అశ్వద్ధామ పాత్ర సూపర్ హిట్ అవ్వడంతో కచ్చితంగా రజిని వేటయ్యన్ సినిమాలో నటించడం ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. ఇక రానా, ఫాహద్ ఫాజిల్ లు కూడా నటించడం సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను దసరా బరిలో అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఐతే ఆల్రెడీ అదే రోజు సూర్య కంగువ సినిమా వస్తుంది. కోలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా దసరాకి సూర్య వర్సెస్ రజినికాంత్ ఫైట్ జరగబోతుంది.

ఐతే రజిని వేటయ్యన్ సినిమాను తెలుగులో అస్సలు ఎవరు పట్టించుకోవట్లేదు. సినిమాకు తెలుగు బిజినెస్ డీల్ ఇంకా పూర్తి కాలేదని టాక్. సూపర్ స్టార్ సినిమాలు వరుస వెంట దెబ్బ వేయడంతో డేర్ చేయాలంటే భయపడుతున్నారు. ఐతే జైలర్ హిట్ తో రజిని ఫాం లోకి వచ్చినా వేటయ్యన్ ప్రచార చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇందుకు కారణమని తెలుస్తుంది. వేటయ్యన్ సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు.

ఐతే తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కు వారు ఊహించని దాని కన్నా ఎక్కువ రేటు చెబుతున్నారట. అందుకే వేటయ్యన్ తెలుగు రైట్స్ ఇంకా ఎవరు తీసుకోలేదని తెలుస్తుంది. ఒకప్పుడు రజిని సినిమా అంటే హాట్ కేకుల్లా రైట్స్ కోసం పోటీ పడి మరీ తీసుకునే వారు. కానీ ఇప్పుడు ఎంత తగ్గిస్తి ఇస్తే అంతా అన్నట్టు చేస్తున్నారు. జైలర్ లాంటి హిట్ మరోటి పడితే కానీ రజిని సినిమాపై ఈ డౌట్లు పటా పంచలు అవుతాయని చెప్పొచ్చు. వేటయ్యన్ తర్వాత లోకేష్ కనకరాజ్ తో కూలీ సినిమా చేస్తున్నాడు రజినికాంత్. ఆ సినిమాపై కూడా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.