Begin typing your search above and press return to search.

లైగర్​ గట్టిగా దెబ్బేసినా.. ఖుషికి నో ఎఫెక్ట్​

ముఖ్యంగా లైగర్​ డిజాస్టర్​.. విజయ్​ మార్కెట్​పై బాగా ఎఫెక్ట్ పడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్​గా కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   21 Aug 2023 5:59 AM GMT
లైగర్​ గట్టిగా దెబ్బేసినా.. ఖుషికి నో ఎఫెక్ట్​
X

సాధారణంగా ఓ పెద్ద డిజాస్టర్ పడితే.. అది ఆ హీరో-హీరోయిన్-దర్శకుడి నెక్స్ట్​ మూవీ బిజినెస్​పై కాస్త ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే.​ పడుతుంది. అయితే ఫ్లాప్​లు కంటిన్యూ అయితే పక్కా బిజినెస్​పై ఎఫెక్ట్ ఉంటుంది. కానీ అది విజయ్​ దేవరకొండ విషయంలో కనపడట్లేదు. ఆయన నటించిన కొత్త సినిమా 'ఖుషి' ప్రీ రిలీజ్​ బిజినెస్​ భారీగా జరిగినట్లు తెలుస్తోంది.

విజయ్​ దేవరకొండ.. గీతా గోవిందం లాంటి బిగ్గెస్ట్ హిట్​ అందుకున్న తర్వాత భారీ స్థాయిలో హిట్​ ఏమీ అందుకోలేదు. ఆయన నటించిన నోటా, ట్యాక్సివాలా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్​ డిజాస్టర్లుగా నిలిచాయి. వీటి తర్వాత వచ్చినా లైగర్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్​లో వచ్చిన ఈ చిత్రం నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది.

దీంతో విజయ్​ కథల ఎంపిక సరిగ్గా లేదంటూ.. మూవీ క్రిటిక్స్​ నుంచి విమర్శలు బాగా వచ్చాయి. ముఖ్యంగా లైగర్​ డిజాస్టర్​.. విజయ్​ మార్కెట్​పై బాగా ఎఫెక్ట్ పడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్​గా కనిపిస్తోంది. ఆయన నటించిన కొత్త సినిమా ఖుషి బిజినెస్ ట్రేడ్​ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్ర ఏరియాలో 20 కోట్ల రేంజ్ బిజినెస్, నైజాం ఏరియాలో రూ.15 కోట్ల రేంజ్ బిజినెస్ జరిగినట్లు తెలిసింది. సీడెడ్ ఏరియాలోరూ. 6 కోట్ల వరకు ధర పలికిందని సమాచారం అందింది. ఓవర్సీస్​లో రూ. 7.5 కోట్ల వరకు జరిగిందని తెలిసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రూ.52 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట.

ఈ చిత్రం బాక్సాఫీస్​ వద్ద క్లీన్ హిట్ స్టేటస్ అందుకోవాలంటే రూ.53 కోట్ల షేర్ అందుకోవాల్సి ఉంటుంది. ​ ట్రాక్​ విజయ్​ రికార్డ్​తో సంబంధం లేకుండా ఈ రేంజ్​లో బిజినెస్ జరగడమంటే మంచి​ విషయమనే చెప్పాలి. అందుకు కారణం ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్​, సాంగ్స్​ ట్రైలరే కారణం. ముఖ్యంగా పాటలకు విశేష స్పందని దక్కింది. సోషల్​ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాటలే వినిపిస్తున్నాయి. ట్రైలర్​ కూడా బాగానే ఆకట్టుకుంది.

ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. దర్శకుడు శివా నిర్వాణ ఈ సినిమాను ప్యూర్ లవ్ అండ్​ ఫ్యామిలీ ఎంటర్టైనర్​గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ స్వరకర్త. చూడాలి మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటుందో.