Begin typing your search above and press return to search.

2025 వ‌ర‌కూ కొత్త సినిమా ప్రారంభోత్సవాలు బంద్!

ఆయా శాఖ‌ల‌కు సంబంధించిన వారిపై చ‌ర్చించి ఈ నిర్ణ‌యాలు వెల్ల‌డించింది.

By:  Tupaki Desk   |   29 July 2024 10:31 AM GMT
2025 వ‌ర‌కూ  కొత్త సినిమా ప్రారంభోత్సవాలు బంద్!
X

త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ నిర్మాత‌ల మండ‌లి కొద్ది సేప‌టి క్రితం భేటి అయి సంచ‌న‌ల నిర్ణ‌యాలు తీసుకుంది. ఇండ‌స్ట్రీలో జ‌రుగుతోన్న ప‌రిణామాలు, స‌మ‌స్య‌ల‌పై స‌మావేశ‌మై కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఆయా శాఖ‌ల‌కు సంబంధించిన వారిపై చ‌ర్చించి ఈ నిర్ణ‌యాలు వెల్ల‌డించింది. స్టార్ హీరోల సినిమాల‌న్నీ 8 వారాల త‌ర్వాతే ఓటీటీలో రిలీజ్ చేయాలి. ఆగ‌స్టు 16 త‌ర్వాత కొత్త సినిమాలు ప్రారంభించ‌కూడ‌దు.

సెట్స్ లో ఉన్న సినిమాలన్నీ అక్టోబ‌ర్ లోపు షూటింగ్ పూర్తి చేయాలి. మ‌ళ్లీ న‌వంబ‌ర్ 1 నుంచి కూడా షూటింగ్ లు నిర్వ‌హించ‌కూడ‌ద‌ని తెలిపింది. కొంద‌రు నటీన‌టులు, సాంకేతిక నిపుణులు నిర్మాణ సంస్థ‌ల నుంచి అడ్వాన్సులు తీసుకుని సినిమాల‌కు త‌గిన విధంగా డేట్లు కేటాయించ‌డంలో విఫ‌ల‌మ వుతున్నారు. ముందు అనుకున్న సినిమా వెనుక అవుతుంది. వెనుక అనుకున్న‌సినిమా ముందుకొస్తుంది.

దీని వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోతున్నారు. ముందుగా ఎవ‌రి ద‌గ్గ‌ర అడ్వాన్స్ తీసుకున్నారో వారి సినిమా షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాతే త‌దుప‌రి సినిమాకి డేట్లు ఇవ్వాలి. న‌టుడు ధ‌నుష్ విష‌యంలో ఇదే ప‌రిస్థితి ఎదురైన నేప‌థ్యంలో ఆ ఉదంతాన్నిగుర్తు చేసి ఈ రూల్ తీసుకొచ్చారు. ధ‌నుష్‌కి వివిధ నిర్మాణ సంస్థ‌ల నుంచి అడ్వాన్సులు వెళ్లాయి. వాళ్లంతా నిర్మాత‌ల అసోసియేష‌న్ లో మాట్లాడి త‌మ ప‌నులు మొద‌లు పెట్టాలి.

అలాగే ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న చాలా సినిమాల‌కు థియేట‌ర్లు దొరక్క ఇబ్బంది ప‌డుతున్నాయి. ఆ సినిమా రిలీజ్ లు ఓ కొలిక్కి వ‌చ్చే వ‌ర‌కూ ఆగస్టు 16 త‌ర్వాత కొత్త సినిమా షూటింగ్లు మొద‌లు పెట్ట‌కూడ‌దు. ప్ర‌స్తుతం సెట్స్ లో ఉన్న సినిమాల‌న్నీ అక్టోబ‌ర్ లోపు పూర్తి చేయాలి. న‌టులు, సాంకేతిక నిపుణుల జీతాలు, ఖ‌ర్చుల‌కు సంబంధించి ప‌ద్ద‌తి లేకుండ ఉంద‌ని, ఇష్టాను సారం పెంచు కుంటూ పోతున్నార‌ని దీన్నిక్ర‌మ‌బ‌ద్దీ క‌రించాలన్నారు. దానికి సంబంధించి స‌రైన ప్ర‌ణాళిక అమ‌లు చేయ‌నున్నారు. ఈనేప‌థ్యంలో న‌వంబ‌ర్ 2024 నుంచి త‌మిళ‌నాడులో ఏ సినిమా షూటింగ్ కూడా జ‌ర‌గ‌దు. ఇవ‌న్నీ క్లియ‌ర్ అయిన త‌ర్వాత 2025 నుంచే కొత్త సినిమాలు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.