ఖర్చు, లొకేషన్ మ్యాటర్ కాదు.. కేవలం అదొక్కటే!
ప్రమోషన్స్ ఎంత బాగా చేసినా సినిమాలో మ్యాటర్ ఉంటే చాలు దూసుకుపోవడం పక్కా అన్నట్లు ఉంది పరిస్థితి.
By: Tupaki Desk | 27 April 2024 12:30 AM GMTసినీ ప్రియుల ఆలోచనా విధానం ఇప్పుడు మొత్తం మారిపోయింది. బడ్జెట్, క్యాస్టింగ్ తో ఎలాంటి సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే చాలు జై కొడుతున్నారు. చిన్న సినిమాలుగా విడుదలైన ఎన్నో చిత్రాలను భారీ హిట్లు చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాల్లోని కంటెంట్ నచ్చకపోతే డిజాస్టర్లుగా మార్చేస్తున్నారు. ప్రమోషన్స్ ఎంత బాగా చేసినా సినిమాలో మ్యాటర్ ఉంటే చాలు దూసుకుపోవడం పక్కా అన్నట్లు ఉంది పరిస్థితి.
అయితే ఒకప్పుడు సినిమాలోని కొన్ని సీన్లను ఫలానా ప్రదేశంలో షూట్ చేశామని, విదేశాలకు వెళ్లామని రిలీజ్ కు ముందు ఆయా చిత్రాల మేకర్స్ చెప్పేవారు. ఇంత బడ్జెట్ అయిందని కూడా వివరించేవారు. ఈ మధ్య ఆ విషయంపై స్టేట్మెంట్స్ ఎక్కడ వినపడకపోయినా.. మళ్లీ ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ అదే వేలోకి వెళ్తున్నారు. ఇటీవల కాలంలో కొంత మంది దర్శక నిర్మాతలు.. షూటింగ్ లొకేషన్స్ కోసం చెబుతున్నారు.
రీసెంట్ గా ఓ సినిమా మేకర్స్.. ఒక సీన్ కోసం రూ.కోట్లు ఖర్చు చేశామని, చిత్రీకరణకు 30 రోజులు పట్టిందని చెప్పారు. అంతేకాకుండా ఇంట్రెస్టింగ్ ప్లేస్ లో సాంగ్ ను షూట్ చేశామని కూడా ప్రమోషన్ చేశారు. ఇప్పుడు ఈ విషయంపై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. ఫలానా సీన్ ను ఫారిన్ లొకేషన్ లో షూట్ చేశామని మేకర్స్ ప్రకటించగానే ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీసే రోజులు పోయాయని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
డిజిటల్ యుగం సినీ ప్రియులకు ప్రపంచాన్ని మరింత దగ్గర చేసిందని, కంటెంట్ మాత్రమే చూస్తున్నారని చెబుతున్నారు. ఎంత మంచి లొకేషన్స్ లో మూవీ షూట్ చేసినా.. కంటెంట్ బాగోలేకపోతే అవన్నీ తేలిపోతాయని అంటున్నారు. ఈ రోజుల్లో ఆడియన్స్ ఎవరూ మూవీలోని లొకేషన్స్ కోసం ఎక్సైట్ అవ్వడం లేదని అంటున్నారు. ఎందుకంటే ఓటీటీల్లోని వివిధ మూవీల్లో అదిరిపోయే లొకేషన్స్ చూస్తున్నారని చెబుతున్నారు.
ఒకవేళ సినిమాల్లోని ఫలానా సీక్వెన్స్ కోసం రూ.కోట్లు ఖర్చు చేశామని చిత్ర నిర్మాతలు చెప్పినా.. ఆ మూవీ కంటెంట్ బాగా లేకపోతే ఫ్లాప్ అవ్వడం పక్కా. కాబట్టి ఇక అలాంటి ప్రమోషన్లు వద్దని, కంటెంట్ బాగుంటే చాలు అని అంటున్నారు. చివరకు బడ్జెట్, ఖర్చు, లొకేషన్ మ్యాటర్ కాదు.. కంటెంటే మెయిన్ మ్యాటర్ అని తెలుగు సినీ ప్రియులు తెగేసి చెబుతున్నారు. మరి మేకర్స్ ఈ విషయంలో ఎలాంటి మార్పులు చేసుకుంటారో చూడాలి.