31 ఏళ్ల నటి మృతి.. కూతురిని అలా చూడలేక..!
ముంబైలో యువనటి మాలాబికా దాస్ అనుమానాస్పద మరణంపై ప్రస్తుతం పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు సాగిస్తున్నారు
By: Tupaki Desk | 11 Jun 2024 4:13 AM GMTముంబైలో యువనటి మాలాబికా దాస్ అనుమానాస్పద మరణంపై ప్రస్తుతం పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు సాగిస్తున్నారు. జూన్ 6న ముంబైలోని తన ఇంటిలో విగత జీవిగా కనిపించిన మాలాబికా దాస్ డిప్రెషన్ తో పోరాడుతోందని ఆమె కుటుంబీకులు వెల్లడించారు. మాజీ ఎయిర్‌హోస్టెస్, నటి నూర్ మలాబికా దాస్ (31) ఆశించిన విధంగా కెరీర్ సాగించలేకపోయినందున తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. మాలాబికా దాస్ పూర్వీకుల ఇల్లు అస్సాంలోని కరీంగంజ్ పట్టణంలో ఉంది.
నటి కావాలనే ఎన్నో ఆశలతో మాలాబికా దాస్ ముంబై వెళ్లింది. అయితే దీన్ని సాధించేందుకు ఆమె తీవ్రంగా పోరాడింది. మాలాబికా తన విజయాలతో సంతృప్తి చెందలేదని మేము అర్థం చేసుకున్నాము. అందుకే ఈ విపరీతమైన చర్యకు పాల్పడిందని.. బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న కరీంగంజ్‌లోని వారి ఇంటిలో మలబాయికా అత్త (తండ్రి) ఆరతీ దాస్ మీడియాతో అన్నారు.
`ది ట్రయల్` వెబ్ సిరీస్ సహా అనేక టీవీ సీరియల్‌లోను మాలాబికా నటించింది. బెంగాలీ మాట్లాడే హిందూ కుటుంబానికి చెందిన మాలాబిక ముంబైలో ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత ఇస్లాం మతంలోకి మారింది. ఆమె షిల్లాంగ్‌లో ఎయిర్ హోస్టెస్ శిక్షణ పొందే ముందు కరీంగంజ్ కళాశాల నుండి సీనియర్ సెకండరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. కెరీర్ ఆశయాలు ఆమెను గౌహతి, కోల్‌కతా, ఢిల్లీకి తీసుకెళ్లాయి. చివరికి ఆమె ముంబైలో స్థిరపడింది. మాలాబిక తండ్రి కంచన్ దాస్ కరీంగంజ్‌లోని లక్ష్మీబజార్ హైస్కూల్‌లో అసిస్టెంట్ హెడ్ టీచర్. జూన్ 6 ఉదయం.. మాలాబిక కుళ్ళిపోయిన మృతదేహం ఆమె అపార్ట్‌మెంట్ పైకప్పుకు వేలాడుతూ కనిపించింది. పర్యవసానంగా అంధేరి పోలీసులు జూన్ 9న ఒక ఎన్జీవో సాయంతో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. తాము వృద్ధాప్యంలో ఉండడం వల్ల తమ కుమార్తె అంత్యక్రియలకు హాజరు కాలేమని తల్లిదండ్రులు తెలిపినట్టు పోలీసులు చెబుతున్నారు. తమ కుమార్తెను ఆ దశలో చూడలేక తల్లి దండ్రులు రాలేదని కూడా భావిస్తున్నారు.